14న వస్తున్న 'బన్నీ అండ్ చెర్రీ'
- IndiaGlitz, [Thursday,December 05 2013]
హరున్ గని బ్యానర్ లో నిర్మితమవుతున్న సినిమా 'బన్నీ అండ్ చెర్రీ'. ప్రిన్స్, మహత్, కృతి, సభా హీరోహీరోయిన్లు. యండమూరి వీరేంద్రనాథ్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. హరున్ గని నిర్మాత. రాజేష్ పులి దర్శకుడు. ఇటీవలే ఆడియో విడుదల జరిగింది. ఆడియోకి మంచి టాక్ వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఏ సర్టిఫికేట్ పొందింది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ నెల 14న విడుదలకు సిద్ధమవుతుంది. కామెడీ కలగలిసిన సైంటిఫిక్ మూవీగా తెరకెక్కింది. బ్రహ్మానందం, పోసాని, ఎల్బీ శ్రీరామ్, చంద్రమోహన్ సీత ఎస్ విఆర్ తదితరులు ఇతర తారాగణం. కెమెరాః వి.రవికుమార్, నిర్మాతః హరున్ గని, కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: రాజేష్ పులి.