మన్మధుడుకు 14 ఏళ్లు..!
Send us your feedback to audioarticles@vaarta.com
నవ మన్మధుడు నాగార్జున హీరోగా విజయ్ భాస్కర్ తెరకెక్కించిన చిత్రం మన్మధుడు. నాగార్జున, సోనాలి బింద్రే, అన్షు హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ - మాటలు అందించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ నాగార్జున నిర్మించారు. ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణతో ఘన విజయం సాధించి నాగార్జున కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రంగా నిలిచింది. ఈ సంచలన చిత్రం మన్మధుడు డిసెంబర్ 20, 2002లో రిలీజైంది...అంటే నేటికి 14 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
ఈ చిత్రంలో నాగార్జున నటన, సోనాలి బింద్రే, అన్షు గ్లామర్, అందమైన ప్రేమకథా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ప్రేమ కథకు తగ్గట్టు త్రివిక్రమ్ డైలాగ్స్, విజయ్ భాస్కర్ మేకింగ్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ వేల్యూస్, దేవిశ్రీ మ్యూజిక్ మూవీకి ఎస్సెట్ గా నిలిచాయి. రొమాంటిక్ కింగ్ నాగార్జునకు సరిగ్గా సరిపోయే టైటిల్ మన్మధుడు. అందుకనే ఈ చిత్రం నాగార్జున కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండే సినిమాగా నిలిచింది. ఒక్క టైటిలే కాదు ఈ సినిమాకు అన్ని సరిగ్గా సరిపోయాయి. నాగార్జునకు మరో పేరుగా మన్మధుడు పాపులర్ అయ్యింది అంటే ఈ సినిమా ఏస్ధాయిలో ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్ర వేసిందో అర్ధం చేసుకోవచ్చు..! నాగార్జునకు మన్మధుడు అనే అద్భుతమైన కథను అందించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నాగచైతన్య, అఖిల్ కు కూడా అద్భుతమైన ప్రేమకథను అందిస్తారని ఆశిద్దాం..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments