కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో ఈ 14 పాయింట్లే కీలకం..
- IndiaGlitz, [Wednesday,May 13 2020]
భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నాడు జాతినుద్ధేశించి మాట్లాడుతూ.. రూ.20 లక్షల కోట్లతో ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ ప్యాకేజీని ప్రకటించిన విషయం విదితమే. అయితే ఆర్థిక ప్యాకేజీ ఎలా ఉంటుందో అనేదానిపై దేశ ప్రజల్లో సర్వత్రా ఆసక్తి..ఉత్కంఠ నెలకొంది. పరివ్రమలకు, మద్య తరగతి రైతులకు ఎలాంటి భరోసా ఇస్తారో అని అందరికీ ఆసక్తి నెలకొంది. ఉద్దీపన ప్యాకేజీ ఆశలతో లాభాల్లో స్టాక్ మార్కెట్లు ముగియడం మంచి పరిణామం. 637 పాయింట్లు సెన్సెక్స్ లాభపడింది. 187 పాయింట్ల నష్టంతో నిఫ్టీ లాభంతో ముగిసింది. ఈ ప్యాకేజీ వివరాలను బుధవారం నాడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిశితంగా మీడియా ముఖంగా వివరించారు. ఈ సందర్భంగా దాదాపు అన్ని రకాల వర్గాల వారికి వరాల వర్షం కురిపించారు. కాగా.. ఇందులో భాగంగా సంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఒకింత శుభవార్తే చెప్పారు. అయితే ఆమె స్పీచ్ మొత్తమ్మీద ఈ 14 పాయింట్సే కీలకం.. ఆ ముఖ్యాంశాలేవే ఇప్పుడు చూద్దాం.
01:- సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎఈ) కోసం రూ. 3 లక్షల కోట్ల రుణాలు
02:- ఇబ్బందుల్లో ఉన్న ఎంఎస్ఎఈల కోసం రూ. 20వేల కోట్లు
03:- ఎంఎస్ఎఈల కోసం రూ. 50వేల కోట్లతో ఈక్విటీ
04:- ఎంఎస్ఎఈల అర్హతల్లో సడలింపులు
05:- 200 కోట్ల వరకు కాంట్రాక్టులకు గ్లోబల్ టెండర్లు అవసరం లేదు
06:- ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే ఎంఎస్ఎఈలకు మరో 3నెలల ప్రభుత్వమే పీఎఫ్ చెల్లిస్తుంది
07:- జూన్, జులై, ఆగస్టు నెలల ఈపీఎఫ్ ప్రభుత్వమే చెల్లిస్తుంది
08:- ఈపీఎఫ్‌లో యాజమాన్య వాటా 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గింపు
09:- విద్యుత్ పంపిణీ సంస్థల కోసం 90వేల కోట్ల లిక్విడిటీ
10:- కేంద్ర సంస్థల పరిధిలోని కాంట్రాక్టులన్నీ 6 నెలల పొడిగింపు
11:- మార్చి-25లోపు పూర్తి చేయాల్సిన రియాల్టీ ప్రాజెక్టుల సమయం పొడిగింపు
12:- మార్చి 2021 వరకు టీడీఎస్, టీసీఎస్ రేటును 25 శాతం తగ్గింపు
13:- టీడీఎస్, టీసీఎస్ తగ్గింపు వల్ల పన్ను చెల్లించేవారికి రూ. 50వేల కోట్ల వరకు బెనిఫిట్
14:- ట్యాక్స్ ఫైలింగ్ గడువు 31 అక్టోబర్ వరకు పొడిగింపు
ఐదు మౌళిక సూత్రాలతో..
‘స్వీయ ఆధారిత భారతం’ అనే పేరుతో ఈ ప్రత్యేక ప్యాకేజీని రూపొందించడం జరిగిందని నిర్మలా సీతారామన్ అన్నారు. పేదలు, వలసకూలీల ఖాతాల్లోకి నేరుగా నగదు జమచేశామన్నారు. మొత్తం ఐదు మౌళిక సూత్రాలతో ఈ ప్రత్యేక ప్యాకేజీని తయారుచేయడం జరిగిందన్నారు. ఆర్థిక, మౌళిక, సాంకేతిక, దేశ జనాభా, డిమాండ్ ప్రధాన సూత్రాలు అని.. భారత్ స్వయం సమృద్ధి సాధించే వరకూ సంస్కరణలు కొనసాగుతాయన్నారు. కాగా.. వివిధ మంత్రిత్వ శాఖలతో చర్చించాక ఈ ప్యాకేజీ రూపకల్పన జరిగిందని.. ఇది దేశాభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పడుతుందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.
లోకల్ బ్రాండ్స్ అభివృద్ధే లక్ష్యం..
మరీ ముఖ్యంగా లోకల్ బ్రాండ్స్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని చెప్పిన విషయాలను ఈ సందర్భంగా మరోసారి ఆమె ప్రస్తావించారు. స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించే లక్ష్యం మన ముందు ఉందని.. అందుకే గత 40 రోజులగా పీపీఈలు, వెంటిలేటర్లు స్వదేశంలోనే ఉత్పత్తి చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ వంటి సంస్కరణలు సత్ఫలితాలు ఇచ్చాయన్నారు. గడిచిన ఐదేళ్లుగా ఎన్నో సంస్కరణల్నీ అమలు చేశామన్నారు. మరీ ముఖ్యంగా మొబైల్ బ్యాంకింగ్, జన్‌ధన్ ఖాతాలతో దేశంలో విప్లవం వచ్చిందని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.