మోహన్‌లాల్‌తో 13 ఏళ్ల మ్యూజిక్ డైరెక్టర్
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్, దక్షిణాది సినిమా పరిశ్రమకు పరిచయం అక్కర్లేని పేరు మోహన్‌లాల్. ఈ మలయాళ సూపర్‌స్టార్ ఇప్పుడు మెగాఫోన్ పట్టబోతున్నాడు. అవును నిజమే! త్వరలోనే ఈయన ఓ ఫాంటసీ సినిమాను చేయబోతున్నాడు. ఈ సినిమాలో ఈయన హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేయనుండటం విశేషం. మలయాళంలోనే భారీ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారట. ఈ సినిమాకు `బారోస్` అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
`బారోస్` సినిమాను గోవాలో చిత్రీకరించడానికి మోహన్‌లాల్ అండ్ టీం ప్లాన్ చేశారట. సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ సినిమాకు 13 ఏళ్ల లైడియన్ అనే కుర్రాడిని మోహన్‌లాల్ సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. ఇంతకు ఈ లైడియన్ ఎవరో తెలుసా? తమిళ సంగీత దర్శకుడు వర్షన్ సతీశ్ కుమారుడే ఈ లైడియన్ ఈ పిల్ల మ్యూజిక్ డైరెక్టర్‌కు మ్యూజిక్‌పై ఎంతో పట్టు ఉందట. ఎంత పట్టు అంటే.. ఇటీవల అమెరికాలో జరిగిన `ద వరల్డ్స్ బెస్ట్` ప్రోగ్రామ్‌లో లైడియన్ టాప్‌గా నిలిచాడట. ఈ కుర్రాడు ఓ నిమిషంలోనే 325 ట్యూన్స్‌ను వినిపించి శ్రోతలను థ్రిల్ చేశాడట. ఈ చిచ్చర పిడుగు తొలిసారి ఓ భారీ బడ్జెట్ చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేయబోతున్నాడని టాక్. మరి లైడియన్ ఇప్పుడున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్‌కి ఎలాంటి పోటీనిస్తాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments