BiggBoss: ‘‘ అప్పుడేం పీకావ్ ’’.. శ్రీహాన్‌కి ఇచ్చిపడేసిన ఇనయా, ఈవారం నామినేషన్స్‌లో 13 మంది
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 6 తెలుగు విజయవంతంగా ఏడో వారానికి చేరుకుంది. ఆదివారం సుదీప ఎలిమినేట్ కావడంతో ఇంటి సభ్యులు కాస్త ఎమోషనల్ అయ్యారు. అందరికీ కడుపు నింపి, అమ్మలా చూసుకుందంటూ బాలాదిత్య కంటతడి పెట్టుకున్నాడు. ఇక సోమవారం వచ్చిందంటే గొడవలకు, వాదోపవాదాలకు పేరు. చాలా మంది సోమవారం కోసం బాగా ఎదురుచూస్తుంటారు. ఎలాంటి కంటెస్టెంట్ అయినా ఆ రోజు కెమెరా స్పేస్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ వుంటారు. ఇక ఎపిసోడ్‌లోకి వెళితే... సుదీప ఎలిమినేషన్ గురించి డిస్కషన్ నడిచింది. సుదీప లేకపోతే నువ్వు బాగా సెట్ అవుతావు అన్న గీతూ మాటల్ని గుర్తుచేసుకున్నాడు బాలాదిత్య. అటు ఇనయా- సూర్యలు ఇక లవ్ ట్రాక్‌ను పక్కనపెట్టి.. ఇక కొట్టుకుందాం అని ఫిక్సయ్యారు. తర్వాత నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించాడు బిగ్‌బాస్. నామినేట్ అయిన వారు బురద షవర్‌లో తలస్నానం చేయాలి.
ఎవరు ఎవరిని నామినేట్ చేశారంటే...
ఫైమా : వాసంతి, బాలాదిత్య
రోహిత్ : రేవంత్ , శ్రీహాన్
శ్రీసత్య: బాలాదిత్య, రేవంత్
బాలాదిత్య: రేవంత్, ఫైమా
ఆదిరెడ్డి : అర్జున్, వాసంతి
మెరీనా : రేవంత్, ఆదిరెడ్డి
గీతూ : వాసంతి,బాలాదిత్య
రాజ్ : బాలాదిత్య, వాసంతి
ఇనయా : బాలాదిత్య, శ్రీహాన్
అర్జున్ : బాలాదిత్య, ఆదిరెడ్డి
వాసంతి : రాజ్, రేవంత్
కీర్తి : బాలాదిత్య, శ్రీహాన్
రేవంత్ : మెరీనా, శ్రీసత్య
సూర్య : బాలాదిత్య, రేవంత్
శ్రీహాన్ : ఇనయా, కీర్తి
దీంతో కెప్టెన్ ఆర్జే సూర్య, గీతూని తప్పించి మొత్తం 13 మంది ఈవారం నామినేషన్స్‌లో వున్నారు. ప్రతిసారి నామినేషన్స్‌లో వుండే గీతూని ఈవారం ఎవ్వరూ పట్టించుకోలేకదు. కెప్టెన్ అయినందున సూర్యను నామినేట్ చేయలేదు.
ఇక నామినేషన్స్ సందర్భంగా ఇనయా- శ్రీహాన్‌ల మధ్య మరోసారి వార్ నడిచింది. ఇప్పటికే వీరిద్దరి మధ్య ఉప్పు నిప్పులా వ్యవహారం వుందన్న సంగతి తెలిసిందే. తన వయసును ప్రస్తావిస్తూ ఏజ్ షేమింగ్ కామెంట్స్ చేస్తున్నాడంటూ ఇనయా శ్రీహాన్‌పై మండిపడింది. అంతేకాదు ‘‘పిట్ట’’ ఎపిసోడ్ కూడా ఇంటిలో యుద్ధ వాతావరణాన్ని తీసుకొచ్చింది. మొన్నటి టాస్క్ సందర్భంగా తనను ఇనయా లయర్ అంటూ కామెంట్ చేసిందని శ్రీహాన్ మండిపడ్డాడ్డు. దీనికి ఇనయా కస్సుమని లేచింది. ఇది నిజం కాదని.. నువ్వు కావాలనే తనను నామినేట్ చేస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదంతా కాదు.. నిన్ను లయర్ అన్నప్పుడు ఏం పీకావ్ అంటూ ఇచ్చి పడేసింది. నామినేట్ చేయడానికి రీజన్ దొరక్క ఇలా కావాలని చేస్తున్నాడంటూ శ్రీహాన్‌పై లేచింది. దీనికి కౌంటర్‌గా శ్రీహాన్‌ను నామినేట్ చేసింది ఇనయా. చమ్కీల విషయం తనతో చెప్పకుండా అందరితో చెప్పాడంటూ మండిపడింది. దీనికి శ్రీహాన్ కూడా ‘‘ఏయ్’’ అంటూ లేచాడు. దీనికి ఇనయా ఫైర్ అయ్యింది. ‘‘ఏయ్’’ ఏంటి నువ్వు అంటే భయపడాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
మొత్తం మీద సూర్యతో లవ్ ట్రాక్‌తో గాడి తప్పిందనుకున్న ఇనయా.. తనలో ఫైర్ తగ్గలేదని నిరూపించుకునే ప్రయత్నం చేసింది. తాను ఇప్పటికీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని రుజువు చేసింది. శ్రీహాన్‌తో గొడవ నేపథ్యంలో మరోసారి ఇనయాకు ఓటింగ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ నామినేషన్స్‌కి సంబంధించి రేపు ఎలాంటి గొడవలు జరుగుతాయో.. ఇనయా ఇదే దూకుడును కంటిన్యూ చేస్తుందో లేక తన లవర్ సూర్యతో సరసాలలో మునిగి తేలుతోందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com