గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్...13 మంది మావోయిస్టుల మృతి

  • IndiaGlitz, [Friday,May 21 2021]

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా పైడి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటనలో 13 మంది మావోయిస్టులు మరణించారు. గడ్చిరోలి జిల్లా పేడి-కొటమి ఎటపల్లి అటవీ ప్రాంతంలో మహారాష్ట్ర సి-60 విభాగానికి చెందిన ప్రత్యేక సాయుధ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. మావోయిస్టులు కాల్పులు జరపగా, పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు.

ఈ ఘటనలో 13 మంది మావోయిస్టులు మరణించారని గడ్చిరోలి డీఐజీ సందీప్ పాటిల్ చెప్పారు. మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్ లో మరింతమంది మావోయిస్టులు మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలంలో మావోయిస్టులకు చెందిన పేలుడు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పైడి అటవీ ప్రాంతంలో పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

More News

కృష్ణపట్నం కరోనా మందు.. అసలు కథ ఇదీ..

‘కృష్ణపట్నం కరోనా మందు..’ కొవిడ్‌ రోగుల పాలిట దివ్వఔషధం! ఇప్పటి వరకూ ఎలాంటి రిమార్క్ లేదు. మందు వాడిన వారంతా కరోనా నుంచి కోలుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..

హృదయాలు గెలుచుకున్న బిగ్ బాస్ విజేత అభిజిత్

తెలుగు బిగ్ బాస్ 4 సీజన్ లో హీరో అభిజిత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. తన నడవడిక, కూల్ నెస్ తో ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు.

అసలీ సుప్రియా తివారీ ఎవరు? ఎందుకంతలా ఆమె పేరు ట్రెండ్ అవుతోంది?

22 ఏళ్ల యువతి.. ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఆమె చర్చే. ఉన్నట్టుండి సడెన్‌గా వేగంగా వెళుతున్న రైలు నుంచి ఆమె తప్పి పోయింది.

చరిత్రలో నిలిచిపోయేలా మెగాస్టార్ మహా సంకల్పం.. ఇక ప్రతి జిల్లాలో..

మెగాస్టార్ చిరంజీవి కోట్లాదిమందికి అభిమాన హీరో. ఎందరికో ఆదర్శంగా నిలిచిన నటుడు.

హాట్ పిక్స్: సోనాల్ చౌహాన్.. సో సెక్సీ

ఢిల్లీ పోరి సోనాల్ చౌహాన్ కు హీరోయిన్ గా అంత సక్సెస్ ఏమీ లేదు. తెలుగులో ఆమె కొన్ని చిత్రాల్లో మాత్రమే నటించింది.