గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్...13 మంది మావోయిస్టుల మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా పైడి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటనలో 13 మంది మావోయిస్టులు మరణించారు. గడ్చిరోలి జిల్లా పేడి-కొటమి ఎటపల్లి అటవీ ప్రాంతంలో మహారాష్ట్ర సి-60 విభాగానికి చెందిన ప్రత్యేక సాయుధ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. మావోయిస్టులు కాల్పులు జరపగా, పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు.
ఈ ఘటనలో 13 మంది మావోయిస్టులు మరణించారని గడ్చిరోలి డీఐజీ సందీప్ పాటిల్ చెప్పారు. మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్ లో మరింతమంది మావోయిస్టులు మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలంలో మావోయిస్టులకు చెందిన పేలుడు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పైడి అటవీ ప్రాంతంలో పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments