12th Fail:తెలుగులోనూ '12th ఫెయిల్' స్ట్రీమింగ్.. ఏ ఓటీటీలో అంటే..?

  • IndiaGlitz, [Tuesday,March 05 2024]

ఇటీవల హిందీలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రం '12th ఫెయిల్'. ప్రముఖ IPS ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. విధు వినోద్ చోప్రా డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మనోజ్ కుమార్ శర్మ పాత్రని విక్రాంత్ మాస్సే పోషించగా.. మనోజ్ సతీమణి, ఐఆర్‌ఎస్ ఆఫీసర్ శ్రద్ధ జోషి పాత్రలో మేధ శంకర్ నటించారు. విడుదలకు ముందు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. కేవలం రూ.20కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ రూ.70కోట్లు రాబట్టి రికార్డు సృష్టించింది. అనంతరం ఓటీటీలో విడుదలై అక్కడ కూడా ప్రేక్షుకుల ఆదరణ పొందింది.

దీంతో ఈ సినిమా టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా అయిపోయింది. నెటిజన్లు అంతా ఈ సినిమాను మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు. అలాగే సెలబ్రెటీలు కూడా మూవీపై ప్రశంసలు కురిపించారు. విమర్శకులు సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇలాంటి సినిమా కేవలం హిందీ భాషలో మాత్రమే అందుబాటులో ఉండటంతో దక్షిణాది అభిమానులు కాస్త నిరుత్సాహం చెందారు. తమ భాషల్లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపారు. దీనిపై మూవీ యూనిట్‌ను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టారు. ఎట్టకేలకు వారి ఎదురుచూపులకు తెరపడింది.

ఈ సినిమా డిస్నీ హాట్‌స్టార్ వేదికగతా నేటి నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో అభిమానులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. మరి సౌత్ ఇండియన్ భాషల్లో ఎలాంటి రికార్డులు నమోదుచేస్తుందో చూడాలి. జీస్టూడియోస్ నిర్మించిన ఈ మూవీలో ప్రియాంషు ఛటర్జీ, సంజయ్ బిష్ణోయ్, హరీష్ ఖన్నా వంచి నటులు కీలక పాత్రలు పోషించారు. శంతను మోయిత్రా ఆకట్టుకునే సంగీతాన్ని అందించారు.

బిహార్‌లోని ఓ గ్రామంలో నిజాయితీపరుడైన క్లర్క్ కొడుకు మనోజ్ కుమార్ 12th ఫెయిల్ అవుతాడు. అయినప్పటికీ ఎప్పటికైనా ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనే కలతో ఢిల్లీలో పార్ట్ టైమ్ జాబులు చేస్తూ కష్టపడి ప్రిపేర్ అవుతాడు. స్వయంకృషితో, సొంత కోచింగ్‌తో మనోజ్ కుమార్ తన కలను నిజం చేసుకుంటాడు. అయితే ఆ ప్రయాణంలో అతను పడిన కష్టాలు, బాధలు, విజయాలు ఇలా ప్రతీ దాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ముఖ్యంగా యూపీఎస్సీ సహా పలు పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే యువతకు ఈ సినిమాకు ఫిదా అయిపోయారు. కాగా ఇటీవల బాలీవుడ్‌లో ప్రకటించిన ఫిలింఫేర్ అవార్డుల్లో ఈ సినిమా ఐదు అవార్డులను సొంతం చేసుకొని శభాష్ అనిపించింది. బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఎడిటింగ్ విభాగాల్లో పురస్కారాలు అందుకుంది.

More News

Nihar Kapoor:జయసుధ వారసుడు.. 'రికార్డ్ బ్రేక్' హీరో నిహార్ కపూర్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..

అలనాటి హీరోయిన్ జయసుధ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన నిహార్ కపూర’ హీరోగా 'రికార్డ్ బ్రేక్' అనే సినిమాలో నటించారు. చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో

Chandrababu:వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

వాలంటీర్లు వైసీపీ కోసం మాత్రం పనిచేయవద్దని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. అనంతపురం జిల్లా పెనుకొండలో నిర్వహించిన 'రా కదలిరా' సభలో చంద్రబాబు పాల్గొన్నారు.

BRS Party: నాలుగు స్థానాలకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు.. ఎవరంటే..?

గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పుడిప్పుడే పార్టీపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టిపెడుతున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచేలా వ్యూహాలు రచిస్తు్న్నారు.

తాకట్టులో సచివాలయం వార్త పూర్తి అవాస్తవం: APCRDA

యెల్లో మీడియా ప్రచారం చేస్తున్న "తాకట్టులో సచివాలయం" వార్త పూర్తి అవాస్తవమని ఏపీసీఆర్డీఏ(APCRDA) తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. "సచివాలయం తాకట్టు వార్త అవాస్తవం.

OTT:ఈ వారం ఓటీటీలోకి అదిరిపోయే సినిమాలు.. హనుమాన్‌ కూడా..

ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో అలరించేందుకు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు సిద్ధమయ్యాయి.