తెలంగాణలో తాజాగా 1286 కరోనా కేసులు..

  • IndiaGlitz, [Tuesday,August 04 2020]

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ కరోనా హెల్త్ బులిటెన్‌ను మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 13,787 శాంపిళ్లను పరీక్షించగా.. 1286 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 68,946కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 12 మంది మృతి చెందగా.. మొత్తంగా 563 మంది మృతి చెందారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 18,708 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి కోలుకుని 1066 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటి వరకూ 49,675 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 391, రంగారెడ్డిలో 121, కరీంనగర్‌లో 101, మేడ్చల్ మల్కాజ్‌గిరి 72, వరంగల్ అర్బన్ 63, నిజామాబాద్ 59, జోగులాంబ గద్వాల 55, ఖమ్మం 41 ఉన్నట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

More News

మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనాతో మృతి

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (59) కరోనాతో మృతి చెందారు. కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో రాజయ్య బాధపడుతున్నారు.

ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ఇక లేరు..

ప్ర‌ముఖ వాగ్గేయకారుడు వంగ‌పండు ప్ర‌సాద‌రావు(77)  మంగ‌ళ‌వారం క‌న్నుమూశారు.

ఏపీలో ఊరటనిస్తున్న కరోనా.. నేడు ఎన్ని కేసులంటే..

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టి కాస్త ఊరటనిస్తోంది. వరుసగా మూడు రోజుల పాటు పది వేలకు పైగా నమోదైన కేసులు నిన్న 8 వేలు నమోదవగా..

48 గంటలు టైమిస్తున్నా.. అసెంబ్లీని రద్దు చేసి రండి: చంద్రబాబు సవాల్

మూడు రాజధానుల అంశం ఏపీలో కాక రేపుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి మద్దతు ఇచ్చిన జగన్..

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ రెండు, మూడో దశ ట్రయల్స్‌కు అనుమతి

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో మరో అడుగు ముందుకు పడింది.