12నే వస్తున్న ఎవడు
Send us your feedback to audioarticles@vaarta.com
ఎవడు సినిమా వాయిదా పడ్డన్ని సార్లు మరే సినిమా వాయిదా పడలేదేమో. ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు సంబంధించి దిల్ రాజు డేట్ అనౌన్స్ చేశారు. జనవరి 12న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బావా, బామ్మర్ది బన్ని, చెర్రి కలిసి నటించిన సినిమా ఇది. ఈ సినిమాలో సత్య పాత్రలో బన్ని ఓ పది నిమిషాలు కనిపిస్తాడు. అదీ పోలీస్ ఆఫీసర్ గా. అతని పక్కన కాజల్ నటించింది.
వంశీ పైడిపల్లి ఈ పది నిమిషాలను మరింత గ్రిప్పింగ్ గా తీశారట. బన్ని కనిపించేది పది నిమిషాలే అయినా ఆ ప్రభావం సినిమా మొత్తం ఉంటుందట. అమీ జాక్సన్ కు తెలుగులో తొలి సినిమా. తొలిసారి ఈ సినిమాలో చరణ్ పక్కన శ్రుతి నటించింది. ఈ సినిమా టీజర్ ను 3న విడుదల చేస్తున్నారు. అత్యధిక థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయడానికి దిల్ రాజు మొగ్గుచూపుతున్నారట.
Follow us on Google News and stay updated with the latest!
-
Contact at support@indiaglitz.com
Comments