యూకే నుంచి తెలంగాణకు 1200 మంది రాక..

  • IndiaGlitz, [Thursday,December 24 2020]

కరోనా కొత్త స్ట్రెయిన్‌పై తెలంగాణ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. యూకే నుంచి వచ్చిన వారిలో ఎవరికైనా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయితే వెంటనే వారిని చికిత్సకు తరలించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే యూకే నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి పాజిటివ్‌ రావడంతో ఈ అంశంపై వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు బుధవారం సుదీర్ఘంగా సమీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్‌ సహా ఐదు జిల్లాల్లోని ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని... డిసెంబరు 9కి ముందు వచ్చిన వారిని పరిశీలనలో ఉంచాలని, ఆ తర్వాత వచ్చిన వారికి ఆర్టీ-పీసీఆర్‌ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి కూడా కొత్త స్ట్రెయిన్‌పై పది రాష్ట్రాల వైద్యశాఖ ముఖ్య కార్యదర్శులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కొత్త రకం వైర్‌సతో ‘పాజిటివ్‌’ నిర్ధారణ అయ్యే వారి నుంచి మరో శాంపిల్‌ను సేకరించి, దాని జన్యుక్రమం విశ్లేషణకు సీసీఎంబీకి పంపాలని నిర్దేశించారు.

మొత్తంగా 1200 మంది యూకే నుంచి రాష్ట్రానికి వచ్చారని, వారందరికీ రెండు రోజుల్లోనే టెస్టులు నిర్వహిస్తామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ 1200 మందిలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల వారే 70 శాతం మంది ఉన్నారని వెల్లడించారు. వారిలో కొందరిని ట్రేస్ చేసి నమూనాలు సేకరించామని.. అయితే కొందరి చిరునామాలు తెలుసుకోవడం కష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు. కాగా.. వరంగల్‌, కరీంనగర్‌, నల్లగొండ, ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ జిల్లాలవారే ఎక్కువగా యూకే నుంచి వచ్చినట్లు గుర్తించారు. వారందర్నీ గుర్తించి యుద్ధ ప్రాతిపదికన టెస్టులు నిర్వహించనున్నారు. కొత్త స్ట్రెయిన్‌ సోకే ఒక్కో రోగిని ఒక్కో గదిలో ఉంచి వైద్యం అందించనున్నారు.

యూకే నుంచి వచ్చిన వారికి బుధవారం సాయంత్రం వరకు నిర్వహించిన టెస్టుల్లో కొత్త స్ట్రెయిన్‌ పాజిటివ్‌లు నమోదు కాలేదని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. డిసెంబరు 9 తర్వాత యూకే నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌కు 380 మంది, రంగారెడ్డికి 70 మంది, మేడ్చల్‌కు 270 మంది వచ్చారని తెలిపారు. కాగా.. మంగళవారం బ్రిటన్‌ నుంచి మరో 12 మంది హైదరాబాద్‌కు రాగా, ఆర్టీ-పీసీఆర్‌ టెస్టుల్లో వారందరికీ నెగెటివ్‌ వచ్చిందని అధికారులు వెల్లడించారు. బ్రిటన్‌ నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 11న ఒకరు, 12న ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వగా, వారిని తొలుత టిమ్స్‌లో ఉంచారు. ఆ తర్వాత లక్షణాలు లేవని ఇళ్లకు పంపి, హోం ఐసొలేషన్‌లో ఉంచారు. కానీ కొత్త స్ట్రెయిన్‌ గురించి తెలియగానే మళ్లీ వారిని ట్రేస్‌ చేసే పనిలో పడింది వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగం. మరోమారు వారికి ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయనున్నారు.

More News

ఏపీకి పాకిన కొత్త కరోనా వైరస్...

నిన్న మొన్నటి వరకూ ఏపీలో కరోనా కేసులు తీవ్రంగా ఉండేవి.. ఈ మధ్యే కరోనా కలకలం బాగా తగ్గిపోయి కాస్త సేఫ్ జోన్‌లోనే ఉందని చెప్పాలి.

కరోనా కొత్త స్ట్రెయిన్ టెన్షన్.. మహారాష్ట్ర బాటలోనే కర్ణాటక..

కరోనా వైరస్ కొత్త రూపు సంతరించుకుని ప్రపంచాన్ని మరోసారి భయాందోళనలలోకి నెట్టేసింది.

అనంతపురంలో ఘోరం.. వెలుగులోకి దిశ తరహా ఘటన..

హైదరాబాద్‌లో జరిగిన దిశ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

రియల్ లొకేషన్స్‌కే మహేశ్ మొగ్గు.. !

సూపర్‌స్టార్‌ మహేశ్‌, పరుశురామ్‌ కాంబినేషన్‌లో రూపొందతున్న చిత్రం 'సర్కారు వారి పాటస‌. ఈ సినిమా షూటింగ్‌ రీసెంట్‌గా హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

క‌రోనా ఎఫెక్ట్.. అణ్ణాత్తే షూట్యింగ్ క్యాన్సిల్‌

సూప‌ర్‌స్టార్ రజినీకాంత్‌, శివ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం అణ్ణాత్తే. స‌న్‌పిక్చ‌ర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్..