ఛత్రపతికి 12 ఏళ్లు

  • IndiaGlitz, [Friday,September 29 2017]

బాహుబ‌లి సిరీస్‌తో జాతీయ స్థాయిలో ఆక‌ట్టుకున్న కాంబినేష‌న్ క‌థానాయ‌కుడు ప్ర‌భాస్‌, ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిది. అయితే ఆ సినిమాల కంటే ముందు వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రం ఛ‌త్ర‌ప‌తి.

మ‌ద‌ర్ సెంటిమెంట్‌తో రూపొందిన ఈ చిత్రంలో రాజ‌మౌళి మార్క్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు కొదువ లేదు. ఫ‌స్టాఫ్ యాక్ష‌న్ ప్ర‌ధానంగా సాగే ఈ సినిమా.. సెకండాఫ్ మ‌ద‌ర్ సెంటిమెంట్‌తో సాగుతుంది. ప్ర‌భాస్ కి అమ్మ‌గా భానుప్రియ న‌టించిన ఈ చిత్రంలో శ్రియ క‌థానాయిక‌గా న‌టించింది.

ష‌ఫీ, సుప్రీత్‌, అజ‌య్‌, కోట శ్రీ‌నివాస‌రావు, ప్ర‌దీప్ రావ‌త్‌ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రానికి కీర‌వాణి అందించిన సంగీతం, నేప‌థ్య సంగీతం ప్ర‌ధాన బ‌లంగా నిలిచాయి. ఈ చిత్రానికి గానూ ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడుగా నంది అవార్డుని సొంతం చేసుకున్నారాయ‌న‌. సెప్టెంబ‌ర్ 29, 2005న విడుద‌లైన ఛ‌త్ర‌ప‌తి.. నేటితో 12 వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటోంది.

More News

ప‌వ‌న్ చిత్రంలో ఉద‌య‌భాను?

జ‌ల్సా, అత్తారింటికి దారేది వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌రువాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఏస్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడో చిత్రం రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే.

మ‌నం డైరెక్ట‌ర్ తో నాని?

శ్రియ తొలి చిత్రం ఇష్టంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన విక్ర‌మ్ కె. కుమార్‌.. ఇష్క్‌, మ‌నం, 24 చిత్రాల‌తో తెలుగువారికి చేరువ‌య్యాడు. ప్ర‌స్తుతం అఖిల్‌తో హ‌లో చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు.

అడివి సాయికిరణ్, సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో శ్రీ చాముండీ చిత్ర సినిమాలు

'మిస్టర్‌ పెళ్లాం', 'శ్రీకారం' వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ చాముండీ చిత్ర చాలా విరామం తర్వాత మళ్లీ సినిమాలు నిర్మించనుంది. ఈ సంస్థ అధినేత గవర పార్థసారధి రెండు సినిమాలు నిర్మిస్తున్నారు.

ఆమెని కూడా మెచ్చుకున్న థ‌మ‌న్‌

యువ సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్‌.. ఇప్పుడు చేతి నిండా సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. నాగార్జున న‌టించిన రాజుగారి గ‌ది2, హిందీ చిత్రం గోల్ మాల్ ఎగైన్‌, సాయిధ‌ర‌మ్ జ‌వాన్‌తో పాటు రేపు విడుద‌ల కానున్న శ‌ర్వానంద్ మ‌హానుభావుడు చిత్రాల‌కు థ‌మ‌న్‌నే సంగీత ద‌ర్శ‌కుడు.

ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ సినిమా అప్పుడేనా?

ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేసిన జైల‌వ‌కుశ ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. టాక్ ఎలా ఉన్నా.. ఓపెనింగ్స్ బాగా వ‌చ్చాయి. మ‌రికొద్ది రోజుల్లో  సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అన్న‌ది స్ప‌ష్ట‌మౌతుంది.