ఛత్రపతికి 12 ఏళ్లు

  • IndiaGlitz, [Friday,September 29 2017]

బాహుబ‌లి సిరీస్‌తో జాతీయ స్థాయిలో ఆక‌ట్టుకున్న కాంబినేష‌న్ క‌థానాయ‌కుడు ప్ర‌భాస్‌, ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిది. అయితే ఆ సినిమాల కంటే ముందు వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రం ఛ‌త్ర‌ప‌తి.

మ‌ద‌ర్ సెంటిమెంట్‌తో రూపొందిన ఈ చిత్రంలో రాజ‌మౌళి మార్క్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు కొదువ లేదు. ఫ‌స్టాఫ్ యాక్ష‌న్ ప్ర‌ధానంగా సాగే ఈ సినిమా.. సెకండాఫ్ మ‌ద‌ర్ సెంటిమెంట్‌తో సాగుతుంది. ప్ర‌భాస్ కి అమ్మ‌గా భానుప్రియ న‌టించిన ఈ చిత్రంలో శ్రియ క‌థానాయిక‌గా న‌టించింది.

ష‌ఫీ, సుప్రీత్‌, అజ‌య్‌, కోట శ్రీ‌నివాస‌రావు, ప్ర‌దీప్ రావ‌త్‌ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రానికి కీర‌వాణి అందించిన సంగీతం, నేప‌థ్య సంగీతం ప్ర‌ధాన బ‌లంగా నిలిచాయి. ఈ చిత్రానికి గానూ ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడుగా నంది అవార్డుని సొంతం చేసుకున్నారాయ‌న‌. సెప్టెంబ‌ర్ 29, 2005న విడుద‌లైన ఛ‌త్ర‌ప‌తి.. నేటితో 12 వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటోంది.