100 వాహనాలు ఒకదానికొకటి ఢీ.. ఐదుగురి మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 100 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. రోడ్డంతా జారుడుగా ఉండటంతో అటుగా వచ్చిన వాహనాల టైర్లు పట్టు కోల్పోయాయి. కనీసం సహాయక చర్యలు అందించేందుకు సైతం సిబ్బంది రాకపోకలు కొనసాగించలేకపోతున్నారు. మైళ్లకొద్దీ వాహనాలు.. చిందరవందరగా పడిపోయాయి. కిలో మీటర్ల మేర ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా 50 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫోర్త్విత్ సమీపంలో 35వ అంతర్రాష్ట్రీయ రహదారిపై గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్రమైన మంచు తుపాను కారణంగా వాహనాల టైర్లు పట్టు కోల్పోవడంతో ఇంతటి భారీ ప్రమాదం తలెత్తింది. అటుగా వచ్చిన వాహనాలు వచ్చినట్టు ఒకదానికొకటి ఢీకొన్నాయి. 100 వాహనాలు ప్రమాదం బారిన పడినట్టు తెలుస్తోంది. చాలా వరకూ వాహనాలు నుజ్జు నుజ్జయి పోయాయి. రోడ్డంతా జారుడుగా ఉండటంతో సహాయక సిబ్బంది సైతం ఆ మార్గంలో రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది పడుతున్నారు.
ఫెడ్ఎక్స్కు చెందిన ట్రక్కు ఒకటి అదుపుతప్పి బారియర్ను ఢీకొని ఆగిపోయింది. వెనుకే వచ్చిన మరికొన్ని కార్లు ఆ ట్రక్కును ఢీకొని నిలిచిపోవడంతో వరుస ప్రమాదాలు జరిగినట్టు భావిస్తున్నారు. కనివినీ ఎరుగని రీతిలో ఈ ప్రమాదం జరిగింది. అతి కష్టం మీద సహాయక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఒక్కో వాహనాన్ని చేరుకుని అందులోని వారిని బయటకు తీసి అవసరమైన చికిత్సను అందిస్తున్నారు. దెబ్బతిన్న వాహనాలను పక్కకు తరలిస్తున్నారు. తీవ్ర గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com