100 వాహనాలు ఒకదానికొకటి ఢీ.. ఐదుగురి మృతి

  • IndiaGlitz, [Friday,February 12 2021]

ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 100 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. రోడ్డంతా జారుడుగా ఉండటంతో అటుగా వచ్చిన వాహనాల టైర్లు పట్టు కోల్పోయాయి. కనీసం సహాయక చర్యలు అందించేందుకు సైతం సిబ్బంది రాకపోకలు కొనసాగించలేకపోతున్నారు. మైళ్లకొద్దీ వాహనాలు.. చిందరవందరగా పడిపోయాయి. కిలో మీటర్ల మేర ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా 50 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.

అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం ఫోర్త్‌విత్‌ సమీపంలో 35వ అంతర్రాష్ట్రీయ రహదారిపై గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్రమైన మంచు తుపాను కారణంగా వాహనాల టైర్లు పట్టు కోల్పోవడంతో ఇంతటి భారీ ప్రమాదం తలెత్తింది. అటుగా వచ్చిన వాహనాలు వచ్చినట్టు ఒకదానికొకటి ఢీకొన్నాయి. 100 వాహనాలు ప్రమాదం బారిన పడినట్టు తెలుస్తోంది. చాలా వరకూ వాహనాలు నుజ్జు నుజ్జయి పోయాయి. రోడ్డంతా జారుడుగా ఉండటంతో సహాయక సిబ్బంది సైతం ఆ మార్గంలో రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది పడుతున్నారు.

ఫెడ్‌ఎక్స్‌కు చెందిన ట్రక్కు ఒకటి అదుపుతప్పి బారియర్‌ను ఢీకొని ఆగిపోయింది. వెనుకే వచ్చిన మరికొన్ని కార్లు ఆ ట్రక్కును ఢీకొని నిలిచిపోవడంతో వరుస ప్రమాదాలు జరిగినట్టు భావిస్తున్నారు. కనివినీ ఎరుగని రీతిలో ఈ ప్రమాదం జరిగింది. అతి కష్టం మీద సహాయక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఒక్కో వాహనాన్ని చేరుకుని అందులోని వారిని బయటకు తీసి అవసరమైన చికిత్సను అందిస్తున్నారు. దెబ్బతిన్న వాహనాలను పక్కకు తరలిస్తున్నారు. తీవ్ర గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్నారు.

More News

ప్రపంచంలో అత్యంత చవకైన ఏసీ ప్రయాణానికి రైల్వే శాఖ ఏర్పాట్లు!

ఏసీ రైలు అంటే కాస్ట్ మామూలుగా ఉంటుందా? ఆ ట్రైన్‌లో ప్రయాణించాలంటే చాలా పెద్ద మొత్తంలో రైల్వేకు చెల్లించాలి.

ఇక హీరోగా ప్రదీప్ కెరీర్ ముగిసినట్టేనా?

యాంకర్స్ అనగానే ప్రస్తుత పరిస్థితుల్లో గుర్తొచ్చే పేర్లు ఫిమేల్ అయితే సుమ.. మేల్ అయితే ప్రదీప్.

విజయ్ సేతుపతి దెబ్బకు విలవిల్లాడుతున్న స్టైలిష్ విలన్!

విజయ్ సేతుపతి.. ఈయనను హీరో అనాలా.. విలన్ అనాలా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనాలా..?

తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల

జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నిక ముగిసిందో లేదో మరో ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదలైంది.

‘ఆచార్య’తో జాయిన్ అయిన పూజా హెగ్డే..!

ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య’. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో నిరంజ‌న్ రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌లు ఈ సినిమాను రూపొందిస్తున్నారు.