100 పుణ్యక్షేత్రాల శాతకర్ణి యాత్ర ప్రారంభం..!
Wednesday, November 9, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ చిత్రాన్ని జాగర్లమూడి క్రిష్ తెరకెక్కిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే...బాలయ్య కెరీర్ లో ప్రెస్టేజియస్ మూవీ అయిన గౌతమీపుత్ర శాతకర్ణి ఘన విజయం సాధించాలని కోరుకుంటూ ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అది ఏమిటంటే...భారతదేశంలోని 100 పుణ్యక్షేత్రాలను దర్శించి ప్రత్యేక పూజలు చేయించనున్నారు. దీని కోసం ప్రత్యేకంగా గౌతమీపుత్ర శాతకర్ణి డిజైన్స్ తో చేసిన మూడు వాహనాల్లో ఈ యాత్ర చేయనున్నారు. పుణ్యక్షేత్రాల్లో 100 కేజీల కుంకమతో అర్చనలు, రుద్రాభిషేకం చేయించనున్నారు. ఈ 100 పుణ్యక్షేత్రాల యాత్రను ఈరోజు బాలకృష్ణ ప్రారంభించారు. ఒక సినిమా సక్సెస్ కోసం 100 పుణ్యక్షేత్రాల్లో పూజలు చేస్తుండడం విశేషం..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments