టాలీవుడ్‌కు బిగ్ రిలీఫ్.. రేపటి నుంచి థియేటర్‌లలో 100 శాతం ఆక్యూపెన్సీ
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు చిత్ర పరిశ్రమ- ఏపీ ప్రభుత్వానికి మధ్య నలుగుతున్న సమస్యలకు ఓ పరిష్కారం లభించేలా కనిపిస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి బృందం, మంచు విష్ణులు ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. అలాగే టికెట్ రేట్లపై ప్రభుత్వం నియమించిన కమిటీ కూడా గురువారం సమావేశమై తమ సిఫారసులను సిద్ధం చేసింది.
భౌగోళికంగా రాష్ట్రాన్ని నాలుగు ప్రాంతాలుగా విభజించడం, గ్రామీణ ప్రాంతాల్లో వున్న ప్రత్యేక సదుపాయాలు వున్న సింగిల్ స్క్రీన్ థియేటర్లను స్పెషల్ కేటగిరీ కింద పరిగణించాలని కమిటీ సిఫారసు చేసింది. కార్పోరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు టికెట్ రేట్లు ఖరారు చేసింది. దీంతో ఎకానమీ క్లాస్‌తో పాటు సినిమా టికెట్ల రేట్లు పెరగనున్నాయి.
ఈ సమావేశానికి హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విశ్వజిత్, ఇతర సభ్యులు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఫిలిం చాంబర్ ప్రతినిధులు హాజరయ్యారు. అనంతరం స్టీరింగ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఏపీలోని థియేటర్లలో శుక్రవారం నుంచి 100 శాతం ఆక్యుపెన్సీ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. అయితే ప్రేక్షకులు మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని వారు సూచించారు.
అటు టిక్కెట్ రేట్లపై అన్ని అంశాలు చర్చించామని.. తాము అడిగిన వాటికి 99 శాతం ప్రభుత్వం అనుకూలంగా ఉందని స్టీరింగ్ కమిటీ సభ్యులు తెలిపారు. మూడు స్లాబుల్లో టికెట్ల ధరలు ఉంటాయన్నారు. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రామదాసు. అతి త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వస్తుందన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com