టాలీవుడ్‌కు బిగ్‌ రిలీఫ్.. రేపటి నుంచి థియేటర్‌లలో 100 శాతం ఆక్యూపెన్సీ

  • IndiaGlitz, [Thursday,February 17 2022]

తెలుగు చిత్ర పరిశ్రమ- ఏపీ ప్రభుత్వానికి మధ్య నలుగుతున్న సమస్యలకు ఓ పరిష్కారం లభించేలా కనిపిస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి బృందం, మంచు విష్ణులు ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. అలాగే టికెట్ రేట్లపై ప్రభుత్వం నియమించిన కమిటీ కూడా గురువారం సమావేశమై తమ సిఫారసులను సిద్ధం చేసింది.

భౌగోళికంగా రాష్ట్రాన్ని నాలుగు ప్రాంతాలుగా విభజించడం, గ్రామీణ ప్రాంతాల్లో వున్న ప్రత్యేక సదుపాయాలు వున్న సింగిల్ స్క్రీన్ థియేటర్లను స్పెషల్ కేటగిరీ కింద పరిగణించాలని కమిటీ సిఫారసు చేసింది. కార్పోరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు టికెట్ రేట్లు ఖరారు చేసింది. దీంతో ఎకానమీ క్లాస్‌తో పాటు సినిమా టికెట్ల రేట్లు పెరగనున్నాయి.

ఈ సమావేశానికి హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విశ్వజిత్, ఇతర సభ్యులు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఫిలిం చాంబర్ ప్రతినిధులు హాజరయ్యారు. అనంతరం స్టీరింగ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఏపీలోని థియేటర్లలో శుక్రవారం నుంచి 100 శాతం ఆక్యుపెన్సీ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. అయితే ప్రేక్షకులు మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని వారు సూచించారు.

అటు టిక్కెట్ రేట్లపై అన్ని అంశాలు చర్చించామని.. తాము అడిగిన వాటికి 99 శాతం ప్రభుత్వం అనుకూలంగా ఉందని స్టీరింగ్ కమిటీ సభ్యులు తెలిపారు. మూడు స్లాబుల్లో టికెట్ల ధరలు ఉంటాయన్నారు. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రామదాసు. అతి త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వస్తుందన్నారు.

More News

నాపైనా, నా ఫ్యామిలీపైనా ట్రోలింగ్.. ఓ ఇద్దరు హీరోల పనే ఇది, శిక్ష తప్పదు : మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు

తనపైనా, తన కుటుంబంపైనా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వారికి కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు వార్నింగ్ ఇచ్చారు. టాలీవుడ్‌కి చెందిన ఓ ఇద్దరు హీరోలు దీని వెనుక వున్నారని..

అమితాబ్ బాడీగార్డ్‌‌గా విధులు.. కానిస్టేబుల్ ఆస్తులు చూసి షాకైన అధికారులు

ప్రముఖులు, సెలబ్రెటీల పేర్లు చెప్పి.. లేదా వాళ్లతో ఫోటోలు దిగి కేటుగాళ్లు పలువురిని మోసం చేసిన ఉదంతాలు ఎన్నో. అయితే ఈ కేసులో మాత్రం ఏకంగా సెలబ్రెటీ దగ్గర పనిచేసిన మాజీ అంగరక్షకుడు కోట్లు వెనకేశాడు.

మాట నిలబెట్టుకున్న కింగ్ నాగార్జున.. వెయ్యి ఎకరాల అటవీ భూమి దత్తత

అగ్ర కథానాయకుడు, కింగ్ నాగార్జున తన మాట నిలబెట్టుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో 1,080 ఎకరాల అటవీ భూమిని ద‌త్త‌త

చిన్నారులను బైకుపై తిప్పుతున్నారా.. కొత్త రూల్ తెలుసా..?

చిన్నారులను బైకులపై ఎక్కించుకుని ఊరంతా తిప్పుతున్నారా..

పెళ్లి చేసుకోనున్న 23 ఏళ్ల మేయ‌ర్, 28 ఏళ్ల ఎమ్మెల్యే, ముహూర్తం ఎప్పుడంటే..?

ప్రస్తుత పరిస్ధితుల్లో రాజకీయాలకు యువత దూరమవుతున్న సంగతి తెలిసిందే.