‘డియో డియో’ సాంగ్‌కు వంద మిలియన్ వ్యూస్

  • IndiaGlitz, [Saturday,March 14 2020]

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ నటించిన ‘గరుడవేగ’ చిత్రంలోని ఐటమ్ సాంగ్ ‘డియో డియో డిసక డిసక’ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సాంగ్‌లో శృంగార సుందరి సన్నీలియోన్ ఆడిపాడింది. ఐటెమ్ సాంగ్ అంటే ఇంతవరకూ తెలుగులోనే ఎవరో ఒకర్ని వెతికిపట్టుకునే రోజులు పోయాయ్.. అందుకే బాలీవుడ్ బ్యూటీని పట్టుకొచ్చి ఆమెచేత అంద చందాలు ఆరబోయించారు. సినిమా రిలీజ్ కాకమునుపే ఈ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేసింది. అయితే తాజాగా.. ఏకంగా వంద మిలియన్ వ్యూస్‌ని కొల్లగొట్టిందంటే సాంగ్‌, సన్నీకున్న క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

సన్నీ అంటేనే ఏ సాంగ్‌ అయినా సూపర్ డూపర్ హిట్టయిపోతుంది. ఆమె నర్తించిన సాంగ్‌ కోసమే జనాలు థియేటర్స్‌కు వెళ్తుంటారంటే శృంగార తారకున్న రేంజ్ అర్థం చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే రసిక ప్రియులకు ఆమె ఓ శృంగార దేవత. ఎంతమంది శృంగార నటీమణులు ఉన్నా.. సన్నీ రేంజ్‌, క్రేజే వేరు. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మెరుస్తోంది.

కాగా.. ఈ డియో డియోకు భాస్కరభట్ల లిరిక్స్ అందించగా.. భీమ్స్ ఈ పాటకి మంచి బాణీలను అందించాడు. ఇక గీతామాధురి మరో సారి తన గాత్రంతో వారెవ్వా.. అనిపించేలా చేసింది. ఈ సాంగ్ రిలీజ్ 2017 డిసెంబర్‌లో రిలీజ్ అయినప్పటికీ ఇప్పటికీ యూ ట్యూబ్‌లో మిలియన్స్ వ్యూస్ సంపాదించుకుంది. కాగా ఇప్టపి వరకూ 101,038,795 వ్యూస్ సంపాదించుకుంది. కామెంట్స్ అయితే వేల కొద్ది వచ్చిపడ్డాయ్.

More News

కరోనా ఎఫెక్ట్.. పద్మ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా

పద్మ అవార్డుల ప్రదానోత్సవంపై కరోనా ప్రభావం పడింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విస్తరిస్తుండటంతో

బ్రేకింగ్ : తెలంగాణలో థియేటర్స్, స్కూల్స్, మాల్స్ బంద్

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా తెలుగు రాష్ట్రాలకు పాకిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఉగాది పచ్చడి లాంటి తెలుగు చిత్రం 'అన్నపూర్ణమ్మ గారి మనవడు' - కళాతపస్వి కె.విశ్వనాథ్

తెలుగు సినీ చరిత్రలో గాని, తెలుగు సినిమా పరిశ్రమలో కానీ సువర్ణ అక్షరాలతో లిఖించ దగిన దర్శకులు ఎవరైనా ఉన్నారంటే అది కళాతపస్వి, తెలుగు సినీసువర్ణ దిగ్గజ దర్శకులు,

యాంక‌ర్ ర‌వి హీరోగా న‌టిస్తోన్న‌'తోట‌బావి' టీజ‌ర్ ని విడుద‌ల చేసిన దర్శకుడు ఎన్. శంకర్

యాంక‌ర్ ర‌వి హీరోగా గౌత‌మి హీరోయిన్ గా  గ‌ద్వాల్ కింగ్స్ స‌మ‌ర్ప‌ణ‌లో జోగులాంబ క్రియేష‌న్స్ ప‌తాకంపై

థియేట‌ర్స్ మూసివేత‌పై నిర్మాత‌ల మండ‌లి చ‌ర్చ‌

ప్ర‌పంచం అంతా క‌రోనా వైర‌స్ ధాటికి భ‌య‌ప‌డుతుంది.