తెలుగులో '100 డేస్ లవ్'

  • IndiaGlitz, [Wednesday,August 12 2015]

దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ లు జంటగా , తమిళంలో ఓకే బంగారం(ఓకే కన్మణి) పేరుతో మరో సక్సెస్ కూడా కొట్టారు. వీరిద్దరూ మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న చిత్రం 100 డేస్ లవ్'. ఈ చిత్రం అదే పేరుతో తెలుగులో విడుదల కానుంది.

ఎస్.ఎస్.సి.మూవీస్ బ్యానర్ పై ఎస్.వెంకటరత్నం ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రతీష్ వర్మ సినిమాటోగ్రఫీ అందించగా, గోవింద్ మీనన్ సంగీతాన్ని, బిజిబల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించారు. ఈ రొమాంటిక్ కామెడితో దుల్కర్, నిత్యాలు ఎలాంటి మాయ చేస్తారో చూడాలి.