పది మంది టాలీవుడ్ హీరోలు ఏకమయ్యారు?
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రకృతి విలయాన్ని ఎదుర్కొవడం ఎవరి తరమూ కాదు. ఇప్పుడు చెన్నై నగరం వరద తాకిడి విలవిలలాడింది. ఇప్పుడు వానలు తగ్గడంతో ప్రజలు భయాందోళనలు వీడారు. ప్రభుత్వం తరపునే కాకుండా ప్రజలు కూడా స్వచ్చందంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ సినిమా ప్రముఖులు తమ వంతుగా విరాళాలను ప్రకటిస్తున్నారు, సేకరిస్తున్నారు.
వరద బాధితుల సహాయార్థం మంచు లక్ష్మి సహా పది మంది హీరోలు కలిసి మన మద్రాసు కోసం` అంటూ విరాళాల సేకరణకు ముందుకు వచ్చారు. వీరిలో నాని, అల్లరి నరేష్, మంచు మనోజ్, రానా, నిఖిల్, మధుశాలిని, నవదీప్, అల్లుశిరీష్, తేజస్విని ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆదివారం సాయంత్రం 4-7 గంటల మధ్యలో విరాళాలను సేకరించడానికి సిద్ధమయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com