10 మంది టీడీపీ అభ్యర్థులు ఫిక్స్.. మంత్రికి నో టికెట్
- IndiaGlitz, [Thursday,February 21 2019]
ఎన్నికలు దగ్గర పడుతుండటంతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు 'సైకిల్' స్పీడ్ పెంచారు. అందరి కంటే ముందుగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలెట్టిన బాబు.. ఇప్పటికే పలు జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీ కంచుకోట.. అయిన కృష్ణా జిల్లాలో పది నియోజకవర్గాలకు గాను అభ్యర్థులను ఫిక్స్ చేశారు. ఈ పది మంది సిట్టింగ్‌లు కావడం గమనార్హం. కాగా గత ఎన్నికల్లో 16కు 11స్థానాలను టీడీపీ దక్కించుకుంది. ఈ సారి 2 ఎంపీ, 16 ఎమ్మెల్యే సీట్లూ టీడీపీనే గెలవాలని ఆ దిశగా అందరూ గెలుపుకు కృషి చేయాలని తెలుగు తమ్ముళ్లు, కార్యకర్తలకు చంద్రబాబు సలహాలు ఇచ్చారు.
అభ్యర్థులు ఫిక్స్ అయిన నియోజకవర్గాలు ఇవే...
మైలవరం - దేవినేని ఉమా
మచిలీపట్నం - కొల్లు రవీంద్ర
అవనిగడ్డ - మండలి బుద్ధ ప్రసాద్
విజయవాడ తూర్పు - గద్దె రామ్మోహనరావు
విజయవాడ సెంట్రల్- బొండా ఉమా
జగ్గయ్యపేట - శ్రీరాం తాతయ్య
నందిగామ - తంగిరాల సౌమ్య
గన్నవరం - వల్లభనేని వంశీ
పెనమలూరు -బోడె ప్రసాద్
విజయవాడ పశ్చిమ - షబానా ఖాతూన్ (ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె)
పెండింగ్ స్థానాలివే.. ఆశావహులు..!
పెడన - సిటింగ్ ఎమ్మెల్యేకు డౌట్
ఆశావహలు: మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్, బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు
గుడివాడ - రావి వెంకటేశ్వరరావు, దేవినేని అవినాశ్
కైకలూరు - ఎంపీ మాగంటిబాబు, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్
తిరువూరు - మంత్రి జవహర్!?, మహిళా నేత పద్మజ
పామర్రు- ఉప్పులేటి కల్పన.. లేదా ఆమె భర్త దేవీప్రసాద్ (ఇద్దరిలో ఒకరి ఇవ్వాలని డిమాండ్ ఉంది)
నూజివీడు- ముద్దరబోయిన వెంకటేశ్వరరావు!?
ఇదిలా ఉంటే 6 స్థానాలపై కసరత్తు కొనసాగుతోంది. వీటిలో వైసీపీ సిట్టింగ్‌లు ఉన్న మూడు సీట్లలో కూడా టీడీపీ అభ్యర్థిత్వాలపై ఇంకా నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఇప్పటికే జిల్లాకు చెందిన సిట్టింగ్‌లతో ఒకసారి చర్చించిన చంద్రబాబు త్వరలోనే మరోసారి భేటీ అవుతారని.. ఆ భేటీలో రెండు ఎంపీ, ఆరు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులెవరనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీలోకి రావాలనుకుంటున్న వంగవీటి రాధాకృష్ణ వ్యవహారం కూడా ఈ భేటీలో ప్రస్తావనకు రానుంది. కాగా ఇంకా జిల్లాలో వైసీపీ, బీజేపీ నుంచి చేరికలు ఉంటాయని సమాచారం. వచ్చే వారిలో ఒకరిద్దరికి అవకాశం ఉంటుందని సమాచారం.