డ్రాగన్ ఆధీనంలో ఉన్న 10 మంది భారత్ సైనికుల విడుదల?
Send us your feedback to audioarticles@vaarta.com
ఇద్దరు ఉన్నతాధికారులు సహా డ్రాగన్ ఆధీనంలో ఉన్న 10 మంది భద్రతా సిబ్బంది విడుదలైనట్టు ఓ ఆంగ్ల పత్రిక తన కథనంలో పేర్కొంది. దాదాపు 40 ఏళ్ల తరువాత భారత సైనికులు చైనాకు చిక్కటం ఇదే తొలిసారని తెలుస్తోంది. భారత్, చైనాల మధ్య గల్వాన్ లోయ ఘటనపై మంగళవారం నుంచి గురువారం వరకూ మూడు సార్లు చర్చలు జరిగాయి. గల్వాన్ లోయలో జరిగిన ఈ చర్చల్లో ఇరు దేశాలకు చెందిన మేజర్ జనరల్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.
అయితే గురువారం మేజర్ జనరల్ అభిజిత్ బాపట్.. చైనా సైన్యాధికారితో చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలించడంతో గురువారం సాయంత్రం భారత్ భద్రతా సిబ్బందిని చైనా విడుదల చేసింది. అయితే ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చర్చకు సంబంధించిన అంశాలను బయటకు తెలియనివ్వలేదని తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments