డ్రాగన్ ఆధీనంలో ఉన్న 10 మంది భారత్ సైనికుల విడుదల?

  • IndiaGlitz, [Friday,June 19 2020]

ఇద్దరు ఉన్నతాధికారులు సహా డ్రాగన్ ఆధీనంలో ఉన్న 10 మంది భద్రతా సిబ్బంది విడుదలైనట్టు ఓ ఆంగ్ల పత్రిక తన కథనంలో పేర్కొంది. దాదాపు 40 ఏళ్ల తరువాత భారత సైనికులు చైనాకు చిక్కటం ఇదే తొలిసారని తెలుస్తోంది. భారత్, చైనాల మధ్య గల్వాన్ లోయ ఘటనపై మంగళవారం నుంచి గురువారం వరకూ మూడు సార్లు చర్చలు జరిగాయి. గల్వాన్ లోయలో జరిగిన ఈ చర్చల్లో ఇరు దేశాలకు చెందిన మేజర్ జనరల్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

అయితే గురువారం మేజర్ జనరల్ అభిజిత్ బాపట్.. చైనా సైన్యాధికారితో చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలించడంతో గురువారం సాయంత్రం భారత్ భద్రతా సిబ్బందిని చైనా విడుదల చేసింది. అయితే ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చర్చకు సంబంధించిన అంశాలను బయటకు తెలియనివ్వలేదని తెలుస్తోంది.

More News

ఏపీ కరోనా బులిటెన్: రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు

లాక్‌డౌన్ సడలింపుల అనంతరం ఏపీలో కరోనా కేసులు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయి.

చంద్రబాబుకి షాకిచ్చిన రేపల్లె ఎమ్మెల్యే అనగాని

అమరావతి: ఏపీలో రాజ్యసభ ఎన్నికలు కొనసాగుతున్నాయి.

29 మందికే వారలా చేస్తే.. 151 మంది ఉన్న మేమేం చెయ్యాలి: రోజా

టీడీపీ శాసనమండలిలో వాపును చూసి బలుపు అనుకుంటోందని.. 29 మంది ఉంటేనే వారలా చేస్తే..

ఏపీలో కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికలు

నేడు ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ తరపున తొలి ఓటు ముఖ్యమంత్రి జగన్ వేయగా..

సుశాంత్ రాజ్‌పుత్ మరణాన్ని జీర్ణించుకోలేక విశాఖ యువతి ఆత్మహత్య

బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్‌పుత్‌కి ఒక్క బాలీవుడ్‌లోనే కాకుండా ఇతర భాషల్లోనూ అభిమానులున్నారు.