మూడురోజుల్లో పది కోట్ల గ్రాస్ వచ్చింది - కోనవెంకట్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పణలో ఎం.వీ.వీ. సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రానికి ఉదయ్ నందనవనమ్ దర్శకుడు. 'గీతాంజలి' వంటి విజయం తర్వాత ఎంవీవీ సినిమా సంస్థ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 4న విడుదలైంది. ఈ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది.
ఈ కార్యక్రమంలో కోనవెకంట్ మాట్లాడుతూ ..సినిమా మూడు రోజుల్లో పది కోట్ల రూపాయల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఫస్టాప్ కంటే సెకండాఫ్, ముఖ్యంగా పృథ్వీ కామెడికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నిఖిల్ పెర్‌ఫార్మెన్స్ గురించి అందరూ మెచ్చుకుంటున్నారు. సినిమా సక్సెస్‌లో భాగమైన అందరికీ థాంక్స్ అన్నారు. నిఖిల్ మాట్లాడుతూ...ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసిన సినిమా ఇది. మా టార్గెట్‌ను రీచ్ అయినట్టుగా భావిస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి, ప్రవీణ్ లక్కరాజు, వైవా హర్ష, నైజాం డిస్ట్రిబ్యూటర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. చెన్నై వరద బాధితుల కోసం శంకరాభరణం ఐదు లక్షల రూపాయలు ఆర్ధిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా 2500 కిలోల బియ్యాన్ని చెన్నైకు పంపుతున్నట్లు కోనవెంకట్ తెలియజేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com