వన్ మిలియన్ వ్యూస్ తో ట్రెండ్ క్రియేట్ చేసిన 'సైజ్ జీరో' ట్రైలర్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ నిర్మించిన భారీ చిత్రం సైజ్ జీరో`. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు .బాహుబలి`, రుద్రమదేవి` వంటి విలక్షణమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన స్టార్ హీరోయిన్ అనుష్క మరో విలక్షణమైన రొమాంటిక్ ఎంటర్ టైనర్ సైజ్ జీరో`తో నవంబర్ 27న మన ముందుకు రానుంది. ఇంజి ఇడుపళగి` అనే పేరుతో ఈ చిత్రం తమిళంలో కూడా నవంబర్ 27నే విడుదల కానుంది.
ఈ చిత్రం వెయిట్ లాస్ కి సంబంధించిన కాన్సెప్ట్ తో తెరకెక్కింది. దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి విన్నూతమైన సబ్జెక్ట్ తో కమర్షియల్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న సైజ్ జీరో` సినిమా ప్రారంభం నుండి ప్రేక్షకుల్లో, సినీ అభిమానుల్లో భారీ క్రేజ్ ను క్రియేట్ చేసింది. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి అందించిన ఆడియో, ట్రైలర్ నవంబర్ 1న విడుదలయ్యాయి. ఆడియో, ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం యూ ట్యూబ్ లో 1 మిలియన్ వ్యూస్ ను సంపాదించుకుని ట్రెండ్ క్రియేట్ చేసింది. రేపు పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న అనుష్కకు ఇది చాలా ఆనందాన్ని కలిగించే విషయం.
అనుష్క, ఆర్య, భరత్, ఊర్వశి, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్ తదితరలు ప్రధాన తారాగణంగా నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిరవ్ షా, ఆర్ట్: ఆనంద్ సాయి, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, కాస్ట్యూమ్స్: ప్రశాంత్, కథ-స్క్రీన్ ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం, నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి,దర్శకత్వం: ప్రకాష్ కోవెలమూడి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments