రెండే రెండు నిమిషాల్లో 1.1 బిలియన్ డాలర్ల నష్టం..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎలక్ట్రిక్ కార్ల సంచలనం టెస్లా సీఈవో, స్పేస్‌ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మస్క్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవల ఆయన చేసిన ఓ ట్వీట్‌తో చైర్మన్ పదవిని పోగొట్టుకున్న విషయం తెలిసిందే. ఆయన స్థానంలో కొత్తగా రాబిన్ డెన్‌హోమ్‌ను నియమించడం జరిగింది. దీంతో షాక్‌తిన్న ఆయన దాని నుంచి తేరుకోక ముందే మరో భారీ షాక్ తగిలింది.
కేవలం రెండే రెండు నిమిషాల్లో 1 బిలియన్ డాలర్లకు పైగా నష్టపోయాడు. గురువారం న్యూయార్క్ ట్రేడింగ్ ఆరంభమైన ఆదిలోనే అనగా.. రెండు నిమిషాల్లోనే టెస్లా కంపెనీ షేర్లు భారీగా కుప్పకూలిపోయాయి. దీంతో ఆయన భారీగా నష్టం వాటిల్లింది.
కేవలం రెండు నిమిషాల్లోనే టెస్లా కంపెనీ షేర్లు 11 శాతం మేర పడిపోవడంతో భారీ షాక్ తగిలినట్లైంది. దీంతో ఎలాన్ మస్క్ 1.1 బిలియన్ డాలర్ల సంపద మొత్తం ఆవిరైంది. కాగా.. ఆ 1.1 బిలియన్ డాలర్లు మొత్తం మన రూపాయల్లో దాదాపు రూ.70,00,00,00,000. అయితే ఒక్కసారిగా ఇంత పెద్ద మోత్తం తుడిచిపెట్టుకుని పోవడం గమనార్హం.
ఒక బిలియన్ డాలర్లకు పైగా ఆస్తులు తుడిచిపెట్టుకుపోవడంతో ఆయన నికర సంపద 22.3 బిలియన్ డాలర్లకు చేరిందని బ్లూమ్‌బ్లర్గ్ ఓ నివేదికలో స్పష్టంచేసింది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో టెస్లా అమ్మకాలు భారీగా తగ్గాయి.
గతేడాది నాలుగవ త్రైమాసికంలో 90, 966లుగా ఉన్న టెస్లా కార్ల అమ్మకాలు ప్రస్తుతం 63,000లకు పడిపోవడంతోనే కంపెనీ షేర్లు భారీగా పడిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి ఎలాన్ మస్క్ చాలా సమయమే పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments