100 కోట్ల క్లబ్‌లో 8 సినిమాలు.. డైరెక్టర్ ఒకడే
Send us your feedback to audioarticles@vaarta.com
ఏ దర్శకుడికైనా తను రూపొందించిన సినిమా సూపర్‌హిట్ అవ్వడం, కలెక్షన్లు కొల్లగొట్టడాన్ని మించిన ఆనందం మరొకటి ఉండదు. అది కూడా తను చేసిన సినిమాల్లో ఎనిమిది సినిమాలు అదే తరహాలో కలెక్షన్లు సాధిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి పరిస్థితి కూడా అలాగే ఉంది.
తను చేసిన సూపర్‌హిట్ సినిమాలతో ఓ అరుదైన రికార్డును సాధించారు శెట్టి. ఆయన రూపొందించిన సినిమాల్లో వరుసగా ఎనిమిది బాక్సాఫీసు వద్ద రూ.100 కోట్లు వసూలు చేశాయి. ఈ ఘనత సాధించిన ఏకైక బాలీవుడ్ దర్శకుడిగా రోహిత్ చరిత్ర సృష్టించారు.
ఈ సందర్భంగా రణ్‌వీర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. రోహిత్ ఎనిమిదో సినిమా రూ.100 కోట్లు దాటిందని ఆనందం వ్యక్తం చేశారు. రోహిత్‌శెట్టి చేసిన ఆ ఎనిమిది సినిమాలు ఏమిటంటే.. 'సింబా', 'గోల్‌మాల్ ఎగైన్', 'దిల్‌వాలే', 'సింగం 1, 2', 'చెన్నై ఎక్స్‌ప్రెస్', 'బోల్ బచ్చన్', 'గోల్‌మాల్ 3'.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com