పవన్ 27.. రూ.కోటి నష్టం..?

  • IndiaGlitz, [Saturday,June 20 2020]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రీఎంట్రీ త‌ర్వాత వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ వ‌చ్చారు. తొలి చిత్రంగా పింక్ రీమేక్‌గా వ‌కీల్‌సాబ్‌ను సిద్దం చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ఆ క‌మ్రంలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం స్టార్ట్ కావ‌డంతో సినిమాల షూటింగ్ ఆగింది. వ‌కీల్‌సాబ్ త‌ర్వాత ప‌వ‌న్ రెండు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అందులో ఒక‌టి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే పీరియాడిక‌ల్ మూవీ. మ‌రో చిత్రం హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్నాడు. ఈ రెండు సినిమాల‌పై ఇప్పుడు క‌రోనా ప్ర‌భావం బాగానే చూపుతుంది.

ఒక ప‌క్క క‌రోనాతో పాటు క్రిష్ అండ్ టీమ్‌ను రీసెంట్‌గా కురిసిన వాన కూడా ఇబ్బంది పెట్టింద‌ట‌. వర్షాల కార‌ణంగా ప‌వ‌న్ 27వ సినిమా కోసం క్రిష్ సిద్ధం చేసిన సెట్స్ పాడ‌య్యాయ‌ట‌. వీటితో ఇప్పుడు షూటింగ్ చేయ‌డం కుద‌ర‌ని అంటున్నార‌ట‌. వ‌ర్షాల కార‌ణంగా కోటి రూపాయ‌ల సెట్ పాడైంద‌ని అంటున్నారు. నిర్మాత‌కు ఇదొక స‌మ‌స్య‌గా మారింది. పీరియాడిక‌ల్ స్టోరీతో తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమా మొఘ‌ల్ కాలం బ్యాక్‌డ్రాప్‌తో రూపొంద‌నుంది. ఈ చిత్రానికి విరూపాక్ష అనే టైటిల్ ప‌రిశీన‌లో ఉంది. ముందు వ‌కీల్ సాబ్‌ను పూర్తి చేసిన త‌ర్వాత ప‌వ‌న్ త‌న 27వ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు.

More News

ఈ విషయం తెలిస్తే మాస్క్ లేకుండా బైక్‌పై ఎట్టి పరిస్థితుల్లో తిరగరు!

కరోనా సమయంలో మాస్క్ తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా మాస్క్ లేకుండా బైక్‌పై కనిపిస్తే ఆపి ఫైన్ వేస్తోంది.

నేటి సాయంత్రం పదో తరగతి పరీక్షలపై స్పష్టతనిస్తాం: ఏపీ విద్యాశాఖామంత్రి

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి విద్యార్థుల్లో కొన్ని అనుమానాలున్నాయి.

'సీటీమార్' లో కబడ్డీ కోచులుగా గోపీచంద్, తమన్నా

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్ హీరోగా, మాస్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌  పతాకంపై  శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం `సీటీమార్‌`.

షాకిస్తున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.. కాస్త ఊరటనిచ్చే అంశమిదే..

జనాభాలో ప్రపంచంలోనే రెండో పెద్ద దేశం మనది.

తెలంగాణ కరోనా టెస్టులు, ట్రీట్‌మెంట్‌లో షాకింగ్ విషయాలు వెలుగులోకి..

రాష్ట్రాలన్నీ ట్రేసింగ్.. టెస్టింగ్.. ట్రీట్‌మెంట్ విధానంతో ముందుకు సాగుతుంటే.. తెలంగాణలో మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.