ధ ధ..ధైర్యానికి జై కొట్టిన కోటి మంది...
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న సినిమా `జై లవకుశ`. ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కల్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించిన మూడు పాత్రల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న జై పాత్రకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు.
ఈ టీజర్‌లో ధ ధ ధైర్యం ఉందా అంటూ నత్తిగా ఎన్టీఆర్ చెప్పే డైలాగ్, లుక్ అన్నింటికీ ఆడియెన్స్ నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇరవై నాలుగు గంటల్లో 7.8 మిలియన్ డిజిటల్ వ్యూస్‌తో దక్షిణాది సినిమాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఏకంగా కోటి వ్యూస్ రాబట్టుకుంది. ఇప్పుడు సినిమాలో ఎన్టీఆర్ చేసిన మిగిలిన రెండు పాత్రల తీరు తెన్నులు ఎలా ఉంటాయనేది అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది. ఈ సినిమాను దసరా సందర్భంగా సెప్టెంబర్ 21న విడుదలవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments