YS Jagan: నాడు వైయస్సార్.. నేడు వైయస్ జగన్.. సేమ్ సిట్యుయేషన్..

  • IndiaGlitz, [Tuesday,January 09 2024]

సింహాన్ని ఎదుర్కోవడానికి గుంటనక్కలన్ని ఒక్కటవుతున్నాయి. కానీ ఆ గుంటనక్కలకు తెలియదు ఏమిటంటే సింహాం గర్జన ముందు తట్టుకుని నిలబడలేవని. ఒక్కడిని ఓడించేందుకు అందరూ గుంపుగా ఏకమవుతున్నారు. ఎంతమంది గుంపు కడితే ప్రత్యర్థి అంత బలంగా ఉన్నట్లు లెక్క. సినిమాల్లో కూడా అంతే కదా విలన్‌ ఎంత బలవంతుడు అయితే హీరో అంతకంటే బలవంతుడుగా ఉంటాడు. ఇప్పుడు ఏపీలో సేమ్ ఇదే పరిస్థితి ఏర్పడింది. గతంలో దివంగత వైయస్సార్‌ను ఢీకొట్టేందుకు అందరూ ఒకటైన పరిస్థితిని గుర్తుకు తెస్తోంది.

గుంపుగా వచ్చిన విపక్షాలు..

2009 ఉమ్మడి ఏపీ ఎన్నికల్లో వైయస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు టీడీపీ, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో దూకుడు ప్రదర్శించేవారు. చిరు దాదాపు సీఎం అనే ప్రచారం కూడా జరిగింది. ప్రజారాజ్యం కారణంగా కాంగ్రెస్ పార్టీకి కాపులు దూరమయ్యారు. కానీ వీటన్నింటిని అడ్డుకుని రెండోసారి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా వైయస్సార్ ప్రమాణస్వీకారం చేశారు. అంతేకాదు అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఏర్పాటుకు కీలకమైన ఎంపీ సీట్లలో 33 సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టించారు. ఇదే అంశాన్ని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం అంగీకరించారు.

ధీటుగా ఎదుర్కొన్న వైయస్సార్..

ఇక ఆనాటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే మొత్తం 294 స్థానాలకు గాను కాంగ్రెస్ 157 స్థానాల్లో, తెలుగుదేశం, టీఆర్ఎస్, వామపక్షాలు కలిసి వచ్చిన మహాకూటమికి 106 స్టానాలు వచ్చాయి. చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం 18, ఇతరులు 13 సీట్లు గెలిచారు. అంతిమంగా వైఎస్సార్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇటు సమర్ధుడైన నాయకుడు నిలబడితే అటు ఎంతమంది నిలబడినా తట్టుకోవడం కష్టమని ఆయన నిరూపించారు. ఏపీలో ప్రస్తుతం జరుతున్న పరిస్థితులను చూస్తుంటే 2009 నాటి పరిస్థితే గుర్తుకు వస్తుంది. అంటే చరిత్ర పునరావృతం అవుతుందన్నమాట.

హిస్టరీ రిపీట్స్..

దీని ప్రకారం 2009లో జరిగినట్లుగానే రానున్న ఎన్నికల్లో సైతం టీడీపీ, జనసేన పొత్తులో ఉండగా బీజేపీని సైతం ఆ కూటమిలోకి తేవడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక కమ్యూనిస్టులను సైతం తమతో తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ప్రతిపక్ష పార్టీలన్ని ఒక్కటవుతున్నాయి. అప్పుడు వైయస్సార్ ఎలా అయితే ఒంటరిగా ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొన్నారో.. ఇప్పుడు సీఎం వైయస్ జగన్ కూడా వారిని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. తనకు ప్రజలతో తప్ప మరే పార్టీతో పొత్తు లేదని తేల్చిచెప్పారు. నియోజకవర్గాల్లో ప్రజామోద అభ్యర్థులను నిలబెట్టే కార్యాచరణలో బిజీగా ఉన్నారు. మొత్తానికి అటువైపు గుంపుగా వస్తుండగా జగన్ మాత్రం సంక్షేమం, అభివృద్ధి తనను గెలిపిస్తాయి అంటూ సింహాంలా సింగిల్‌గా వెళ్తున్నారు. అప్పట్లో వైయస్ఆర్ సాధించినట్లే సింగిల్ హ్యాండ్‌తో విజయం సాధించేందుకు జగన్, అయన సైన్యం యుద్ధానికి సిద్ధమవుతున్నారు.