జగన్‌కు డ్రైవింగ్ రాదు.. నేనే నంబర్ 1 డ్రైవర్!

  • IndiaGlitz, [Saturday,February 23 2019]

ఇదేంటి వైఎస్‌ జగన్‌కు డ్రైవింగ్‌‌ రాకపోవడమేంటని ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే.. జగన్‌‌కు నిజంగానే డ్రైవింగ్ రాదు.. నేనే నంబర్ 1 డ్రైవర్‌‌ను అని సీఎం చంద్రబాబు చెప్పుకుంటున్నారు. ఎన్నికలు దగ్గరపడితే చిత్ర విచిత్రాలు ఒక్కోసారి చూసి అవ్వా.. అని నోరు మూసుకోక తప్పదు మరి. ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అటు అధికార.. ఇటు ప్రతిపక్ష పార్టీలు ఏ చిన్నపాటి అవకాశమొచ్చినా చాలు దాన్ని సువర్ణావకాశంగా మలుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. శనివారం సాయంత్రం చీరాల నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు సమవేశమయ్యారు. ఈ సందర్భంగా ఆటో ఎందుకు గుర్తొచ్చిందో తెలియదు గానీ ఆటో పంచ్‌‌లతో బాబు అందర్నీ ఆకట్టుకున్నారు.

జగన్‌కు డ్రైవింగ్ రాదు.. నేనే సీనియర్‌ను..!

నాకు డ్రైవింగ్ బాగా వచ్చు.. జగన్ మోహన్ రెడ్డికి అసలు డ్రైవింగ్ రాదు. జగన్ ఎప్పుడూ డ్రైవింగ్ స్కూల్‌కి కూడా వెళ్లలేదు. ఆటో యజమానులు అంతా నన్ను డ్రైవర్ నెంబర్-1 అంటున్నారు. మేం ఆటోను భద్రంగా నడుపుతాం. మీరు రాష్ట్రాన్ని భద్రంగా నడిపిస్తారు అంటున్నారు. జగన్మోహన్‌రెడ్డికి డ్రైవింగ్ చేతకాదు. డ్రైవింగ్ రానివాడికి వాహనం ఇస్తే యాక్సిడెంట్లే. జగన్‌మోహన్ రెడ్డికి రాష్ట్రం అప్పగిస్తే యాక్సిడెంట్లే అని చీరాల నియోజకవర్గ నేతలతో చంద్రబాబు చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఈ మాటలు ఎంత సరదాగా అన్నప్పటికీ దీని వెనుక అర్థం చాలా పెద్దదే ఉంది. తనను తాను సీనియర్ డ్రైవర్‌గా చెప్పుకొన్న ఆయన.. జగన్‌కు పరిపాలన అనుభవం లేదు కాబట్టి.. ఆయన డ్రైవింగ్ స్కూల్‌కి కూడా వెళ్లలేదన్నట్టుగా పరోక్షంగా పై విధంగా సెటైర్ల వర్షం కురిపించారు.

ఆపరేషన్ ఆమంచి.. !

శనివారం సాయంత్రం చీరాల నేతలతో చంద్రబాబు చర్చలు ముగిశాయి. ఈ సందర్భంగా చీరాల నుంచి ఎవర్ని నిలబెట్టాలని కొందరు నేతలతో బాబు విడివిడిగా మాట్లాడారు. ఈ సమావేశానికి సీనియర్ నేత కరణం బలరాం, పోతుల సునీత, ఇనగా సుబ్రమణ్యం హాజరయ్యారు. కాగా మొదటిసారి చర్చలు ఫలించక పోగా ఈ సందర్భంగా చీరాలలో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు.  చీరాల నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని నేతలకు ఈ సందర్భంగా ఆయన సూచించారు. గతంలో ఆమంచి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ధర్నాలు చేశామని.. పార్టీ బలోపేతం కోసం ఆమంచిని తీసుకున్నామని ఈ సందర్భంగా బాబు గుర్తు చేశారు.  పార్టీలో ఉన్నన్ని రోజులు ఉండి పనులన్నీ చేసుకుని బయటికెళ్లిన తర్వాత విమర్శించడం బాధాకరమన్నారు. ఇలాంటి అవకాశవాదులకు ప్రజలే బుద్ధి చెబుతారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే బాబు దృష్టంతా ఆమంచి పైనే ఉండటంతో ‘ఆపరేషన్ ఆమంచి’ ప్రారంభించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

More News

'గోల్కొండ సింహం' బాల్‌రెడ్డి కన్నుమూత

బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్‌రెడ్డి (73) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.

చిరంజీవి టైటిల్‌తో నాని?

నేచుర‌ల్ స్టార్ నాని, విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా ఇటీవ‌ల మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ సినిమా టైటిల్‌ను రేపు అనౌన్స్ చేయ‌బోతున్నారు.

మ‌రో ప్లాప్ డైరెక్ట‌ర్‌తో శర్వా

'లై' సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. అయితే హీరో శ‌ర్వానంద్ ద‌ర్శ‌కుడిపై న‌మ్మ‌కంతో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మై.. 'ప‌డిప‌డిలేచెమ‌న‌సు' సినిమా చేశాడు. ఈ సినిమాకు డిజాస్ట‌ర్ అయ్యింది.

వెబ్‌సిరీస్ ప్లానింగ్‌లో నంద‌మూరి హీరో...

ప్రస్తుతం డిజిటల్ రంగానికి చాలా పెద్ద ఊపు ఉంది. చాలా మంది సినిమా రంగానికి చెందిన ద‌ర్శ‌కులు,

జూన్‌కి 'మ‌హ‌ర్షి'

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ హీరోగా రూపొందుతోన్న చిత్రం 'మ‌హ‌ర్షి'. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో అశ్వినీద‌త్, దిల్‌రాజు, పివిపి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌హేష్ న‌టిస్తోన్న 25వ చిత్ర‌మిది.