భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైమ్ వైఎస్ జగన్ ఇలా...!
Send us your feedback to audioarticles@vaarta.com
అవును.. మీరు వింటున్నది నిజమే.. భారతదేశంలో ఇంతవరకూ ఎప్పుడూ ఎవరూ చేయని సాహసాన్ని ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేశారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే.. కేవలం ఇద్దరు డిప్యూటీ సీఎంలను మాత్రమే నియమిస్తోంది. అయితే మంత్రి వర్గ ఏర్పాటులో జగన్ మాత్రం ఏకంగా ఐదుగుర్ని డిప్యూటీ సీఎంలుగా నియమించడం విశేషమని చెప్పుకోవచ్చు. దేశంలో ఇంతవరకూ ఎవరూ కనివినీ ఎరుగని.. కనీసం ఊహించని విధంగా వైఎస్ జగన్ ట్విస్ట్ ఇచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశ చరిత్రలో ఇదొక కొత్త ఒరవడి సృష్టించడం అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
శనివారం జరిగిన వైసీపీఎల్పీ సమావేశంలో జగన్ తన కేబినెట్లో ఐదుగుర్ని డిప్యూటీ సీఎంలను నియమిస్తున్నట్లు తేల్చిచెప్పారు. అంతేకాదు.. ఆ ఐదుగురు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులనే జగన్ నియమించబోతున్నారు. బడుకు బలహీన వర్గాలకు చెందిన అందరికీ ప్రాతినిధ్యం కల్పించాలన్న లక్ష్యంతో ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించడం చరిత్రలో ఇదే మొదటిసారి.
అత్యంత ఉన్నత స్థానాల్లో సామాజిక వర్గాల వారిగా సమ ప్రాధాన్యత కల్పించేందుకు వైఎస్ జగన్ తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో రాజకీయ విశ్లేషకులు, నేతలు సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దేశంలో ఫస్ట్ టైమ్ జగన్ ఈ నిర్ణయం తీసుకోవడంతో వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
ఆ ఐదుగురు డిప్యూటీ సీఎంలు వీరే..
1. ఆళ్ల నాని(కాపు)
2. కొలుసు పార్థసారథి (యాదవ్)
3. రాజన్నదొర(ఎస్టీ)
4. అంజాద్ బాషా(మైనారిటీ)...
5. మేకతోటి సుచరిత(ఎస్సీ)
కాగా.. మొదట వైసీపీ సీనియర్ నేత, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేరు ప్రచారంలో ఉండేది. అయితే ఆఖరికి ఆయన పేరు అస్సలు వినపడలేదు. దీంతో ఆయనకు కేబినెట్లో కీలక శాఖ కట్టబెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com