Dil Raju: తెలంగాణ ప్రభుత్వానికి, చిత్రసీమకు వారధిగా ఉంటా... రేవంత్ రెడ్డిని, బన్నీని కలుస్తా

  • IndiaGlitz, [Tuesday,December 24 2024]

తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనమైన అల్లు అర్జున్ అరెస్టు, సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మరణించిన రేవతి గురించి తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు స్పందించారు.

సంధ్య థియేటర్ తొక్కిసలాట దేశవ్యాప్తంగా సంచలనమైంది.‌ పుష్ప ది రూల్ పెయిడ్ ప్రీమియర్ చూడడానికి కుటుంబంతో కలిసి వచ్చిన రేవతి మరణం తెలంగాణ అసెంబ్లీలో చర్చకు దారి తీసింది.‌ పుష్ప సినిమాలో హీరో అల్లు అర్జున్ అరెస్ట్, తర్వాత జరిగిన పరిణామాలు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాలే. హీరోది తప్పని కొందరు, సీఎం రేవంత్ రెడ్డి ది తప్పు అని మరికొందరు సోషల్ మీడియాలో ఎవరికి వారు తమకు తోచిన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తెలుగు చిత్రసీమకు, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతోందని కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తాజా పరిణామాలపై స్పందించారు.

రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరుతున్నాం...తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా వెళ్లి కలుస్తాం! తెలంగాణ ప్రభుత్వానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మధ్య వారధిగా ఉండాలని తనను తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షునిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించారని దిల్ రాజు తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు ఆసుపత్రికి వెళ్లి రేవతి కుటుంబాన్ని కలిశానని వివరించారు.

రేవతి కుటుంబం బాధ్యతను తాము తీసుకుంటామని దిల్ రాజు మీడియా ముఖంగా వెల్లడించారు. రేవతి భర్తకు చిత్రసీమలో ఏదో ఒక ఉద్యోగం ఇప్పించే ఏర్పాట్లు చేస్తానని ఆయన స్పష్టంగా చెప్పారు. రేవతి కుమారుడు శ్రీ తేజ్ ఆరోగ్యం రోజురోజుకు మెరుగుపడుతోందని, త్వరలో ఆ చిన్నారి పూర్తి ఆరోగ్యంతో బయటకు వస్తాడని ఆశిస్తున్నట్లు దిల్ రాజు తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరామని, రెండు మూడు రోజుల్లో తెలుగు చిత్రసీమలోని పెద్దలు అందరం వెళ్లి ఆయనను కలిసి మాట్లాడాలని అనుకున్నట్లు దిల్ రాజు‌‌ తెలిపారు. సీఎం అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత‌ కలుస్తామని వివరించారు. దిల్ రాజు చెప్పిన వివరాల ప్రకారం... బుధ లేదా గురువారాలలో టాలీవుడ్ పెద్దలు రేవంత్ రెడ్డిని కలవనున్నారు.

బన్నీని కలుస్తా... అతనితోనూ మాట్లాడతా!సంధ్య థియేటర్ తొక్కిసలాట తర్వాత బన్నీ వార్తల్లో నిలిచారు. ఆ ఘటన పట్ల ఆయన విచారం వ్యక్తం చేసినప్పటికీ... చట్టపరమైన అంశాల ప్రకారం పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. హైకోర్టులో మధ్యంతర బెయిల్ ద్వారా బయటకు రావడం, మంగళవారం విచారణకు ఆయనను పోలీసులు పిలవడం వంటి విషయాలు అన్నీ తెలిసినవే. ఈ క్రమంలో అల్లు అర్జున్ ను సైతం కలవనున్నట్లు దిల్ రాజు తెలిపారు అతనితో కూడా మాట్లాడతానని ఆయన చెప్పారు.

గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కారణంగా నాలుగైదు రోజుల నుంచి దిల్ రాజు హైదరాబాద్ సిటీలో లేరు. అమెరికా వెళ్లి వచ్చారు. ఈ క్రమంలో చాలా విషయాలు జరిగాయి. అల్లు అర్జున్ అరెస్టు సమయంలో ఆయన ఇక్కడ ఉన్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి వచ్చారు. తర్వాత జరిగిన పరిణామాలపై బన్నీతో ఆయన తండ్రి అరవింద ్ తో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి.

More News

సభ్యత్వ నమోదులో టిడిపి రికార్డు బ్రేక్

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ సారధ్యంలో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం సరికొత్త రికార్డు సృష్టించింది. జెట్ స్పీడ్ తో ముందుకు సాగుతూ చరిత్రను తిరగ రాస్తోంది.

'జ్యువెల్ థీఫ్' నవంబర్ 8న థియేట‌ర్‌ల‌లో విడుద‌ల

సెన్సార్ బోర్డు ప్ర‌శంస‌లతో ‘జ్యువెల్ థీఫ్ - Beware of Burglar’ చిత్రంపై అంచ‌నాలు మ‌రింతా పెరిగాయని నిర్మాత మల్లెల ప్రభాకర్ చెప్పారు. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు

అమెరికాలోనూ మంత్రి నారా లోకేష్ కు అభిమానుల తాకిడి!

శాన్ ఫ్రాన్సిస్కో: పెట్టుబడుల సాధన కోసం అమెరికా వెళ్లిన రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కు అక్కడ కూడా అభిమానుల తాకిడి తప్పలేదు.

శాన్ ఫ్రాన్సిస్కోలో మంత్రి లోకేష్ కు అపూర్వ స్వాగతం

శాన్ ఫ్రాన్సిస్కో (యూఎస్ఏ): పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి చేరుకున్న రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కు

తనికెళ్ళ భరణి సన్మాన వేడుక.. ఆకట్టుకునేలా రామ్ గోపాల్ వర్మ, పురాణపండ స్పీచ్

తనికెళ్ళ భరణి.. కేవలం తెలుగు సినిమా పరిశ్రమలో కేవలం నటుడిగా మాత్రమే కాకుండా రచయితగా, దర్శకుడిగా సుపరిచితులు.