సాగర్ మంచి హీరోగా ఎదగాలి : వి.వి.వినాయక్

  • IndiaGlitz, [Friday,June 07 2019]

సమరం చాలా పెద్ద హిట్ అయి సాగర్ ఇండస్ట్రీలో మంచి హీరోగా ఎదగాలని కోరుకుంటున్నాను... సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్

సాగర్ గంధం హీరోగా ప్రగ్య నయన్ హీరోయిన్ గా సుమన్, వినోద్ కుమార్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం సమరం. జననీ క్రియేషన్స్ బ్యానరుపై యూనివర్సల్ ఫిలిమ్స్ సమర్పణలో బషీర్ ఆలూరి దర్శకత్వంలో శ్రీనివాస్ వీరం శెట్టి, పి .లక్ష్మణాచారి సంయుక్తంగా తెలుగు, కన్నడ భాషల్లో సమరం చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగె యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని సెన్సషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ రిలీజ్ చేసారు. అనంతరం ఏర్పాటైన సమావేశంలో హీరో సాగర్ గంధం, దర్శకుడు బషీర్ ఆలూరి, నిర్మాతలు శ్రీనివాస్ వీరంశెట్టి, పోకూరి లక్ష్మణాచారి పాల్గొన్నారు.

సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి. వినాయక్ మాట్లాడుతూ.. సమరం టైటిల్ చాలా బాగుంది. పోస్టర్స్ అన్నీ ఇంట్రెస్టింగ్ గా వున్నాయి. డైరెక్టర్ బషీర్ చెప్పిన కాన్సెప్ట్ కొత్తగా వుంది. డెఫినెట్ గా ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుంది. సినిమా మంచి హిట్ అయి హీరో సాగర్ ఇండస్ట్రీలో మంచి హీరోగా ఎదగాలని కోరుకుంటున్నాను..టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.

హీరో సాగర్ గంధం మాట్లాడుతూ.. తెలుగులో ఇ ది నా మూడవ సినిమా. యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఒక మంచి క్యారెక్టర్ ఈ చిత్రంలో చేశాను. సుమన్, వినోద్ కుమార్ లాంటి పెద్ద యాక్టర్స్ తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా వుంది. ప్రగ్య హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. మా చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ వినాయక్ గారికి నా కృతజ్ఞతలు.. అన్నారు.

నిర్మాత పోకూరి లక్ష్మణా చారి మాట్లాడుతూ.. మాది మాచర్ల. పల్నాడు ప్రాంతం నుండి వచ్చాను. చిన్నప్పటి నుండి సినిమా అంటే చాలా ఇష్టం. సినిమాలు చూస్తూ పెరిగాను. ఎప్పటికైనా సినిమా ఇండస్ట్రీకి వెళ్లి మంచి సినిమా తీయాలని నా కోరిక. డైరెక్టర్ బషీర్ చెప్పిన కథ నచ్చి జననీ క్రియేషన్స్ బ్యానర్ లో సమరం సినిమా తీశాను.

షూటింగ్ అంతా పూర్తి అయింది. రిలీజ్ కి రెడీగా ఉంది. సినిమా నేను ఊహించిన దానికన్నా బాగా వచ్చింది. కచ్చితంగా మా సమరం సినిమా సూపర్ హిట్ అవుతుందని కాన్ఫిడెంట్ గా వున్నాను.. మా చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన వినాయక్ గారికి నా ధన్యవాదాలు అన్నారు.

దర్శకుడు బషీర్ ఆలూరి మాట్లాడుతూ.. వినాయక్ గారిలాంటి పెద్ద డైరెక్టర్ మా సినిమా మొదటి లుక్ ని విడుదల చేయడం చాలా సంతోషంగా వుంది. ఆయనకి నా థాంక్స్. సినిమా విషయానికి వస్తే .. విలేజ్ నుండి సిటీకి వచ్చిన ఒక ఇంజనీరింగ్ అమ్మాయి సాఫ్ట్ వేర్ కంపెనీలో జాయిన్ అవుతుంది. అక్కడ ఎలాంటి పరిణామాలు జరిగాయి అనేది చిత్ర కతాంశం. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కమర్షియల్ ఎలిమెంట్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేవిధంగా ఈ చిత్రం ఉంటుంది. మా నిర్మాతలు క్వాలిటీ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.. అన్నారు.

నిర్మాతల్లో ఒకరైన శ్రీనివాస్ వీరంశెట్టి మాట్లాడుతూ.. తెలుగు కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించాం. మా హీరో సాగర్ గారు ఎంతో సపోర్ట్ అందించారు. అలాగే మా చిత్రంలో నటించిన సుమన్, వినోద్ కుమార్, రామ్ జగన్ ఇంకా టెక్నీషియన్స్ అందరూ మాకు సపోర్ట్ చేసి సకాలంలో ఈ సినిమా పూర్తి అవడానికి తోడ్పాటు అందించారు.ఆణి ముత్యాల్లాంటి ఐదు పాటలు, నాలుగు ఫైట్స్ వున్నాయి. అడగ్గానే మా చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన వినాయక్ గారికి మా యూనిట్ తరుపున కృతజ్ఞతలు. త్వరలోనే ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరపడానికి ప్లాన్ చేస్తున్నాం.. అన్నారు.

సాగర్ గంధం, ప్రగ్య నయన్, సుమన్, వినోద్ కుమార్, సత్య ప్రకాష్, జహిదా, ప్రియాంశు, సహన, వేణుగోపాల్, జబర్దస్త్ అప్పారావు, చిట్టిబాబు, రాంజగన్, జై, జబర్దస్త్ రాము, రాగిణి, ప్రభావతి, లోకియ (కన్నడ కమేడియన్), జబర్దస్త్ దుర్గ రావు, జయకుమార్, వెంకీ, అనిల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ-మాటలు: నండూరి వీరేష్, కెమెరా: నాగబాబు కర్ర, ఎడిటర్: శ్రీనుబాబు, సంగీతం: రాజ్ కిరణ్, లిరిక్స్: రామారావు, ఫైట్స్: అవినాష్, కొరియోగ్రఫీ: కపిల్ రమేష్, నరేష్ ఆనంద్, మేకప్: పీటర్, కాస్ట్యూమ్స్: అంజి, ఆర్ట్: సురేష్ భాను, ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్.డేవిడ్, కో- ప్రొడ్యూసర్: ప్రగ్యానయన్, నిర్మాతలు: శ్రీనివాస్ వీరంసెట్టి, పోకూరి లక్ష్మణాచారి, కథ-మాటలు: నండూరి వీరేశ్, స్క్రీన్-ప్లై దర్శకత్వం: బషీర్ ఆలూరి..

 

 

More News

సెన్సార్ కార్య‌క్ర‌మాల్లో 'నేనే కేడీ నెం-1'

‘శంభో శంకర’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు, భారీ ఓపెనింగ్స్‌ రాబట్టుకున్న షకలక శంకర్‌ నటిస్తోన్న తాజా చిత్రం  `నేనే కేడీ నెం`1’.

జగన్ కేబినెట్‌‌లో మంత్రులు 25మంది కాదు.. 100!

ఇదేంటి.. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా 25 మంది ఇంకా ఎక్కువంటే మరో 5 కలిపి మొత్తం 30 వరకు మాత్రమే ఉంటాయ్.. కదా? 100 మంది ఎలా ఉంటారని ఆశ్చర్యపోతున్నారా..?

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నుంచి... జూన్ 14న భారీ అంచనాలతో వస్తున్న సెన్సేషనల్ బోల్డ్ మూవీ "ఐ లవ్ యు"

కన్నడ సూపర్ స్టార్ ఊపేంద్ర ఇప్పటివరకు చేసిన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓం, ఏ, సూపర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తో సంచలనం సృష్టించాడు.

భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైమ్ వైఎస్ జగన్ ఇలా...!

అవును.. మీరు వింటున్నది నిజమే.. భారతదేశంలో ఇంతవరకూ ఎప్పుడూ ఎవరూ చేయని సాహసాన్ని ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేశారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే

13 ఏళ్ల త‌ర్వాత హిట్ కాంబినేషన్‌...

13 ఏళ్ల త‌ర్వాత ఓ హిట్ కాంబినేష‌న్ రిపీట్ కాబోతుంది. ఇంత‌కు ఆ హిట్ కాంబో ఏదో తెలుసా!. స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను. 2005లో దిల్‌రాజు నిర్మించిన `భ‌ద్ర` సినిమాతో