విశాల్ చిత్రం వాయిదా

  • IndiaGlitz, [Friday,May 10 2019]

న‌టుడు, న‌డిగ‌ర్ సంఘం కార్య‌ద‌ర్శి, నిర్మాత‌ల సంఘం అధ్య‌క్షుడు విశాల్ న‌టించిన చిత్రం 'అయోగ్య‌'. తెలుగులో విజ‌య‌వంత‌మైన 'టెంప‌ర్'కు ఇది రీమేక్‌. రాశీఖ‌న్నా హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమాను మే 10న విడుద‌ల చేయాల‌నుకున్నారు. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ శిష్యుడు వెంక‌ట్ మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా ప్ర‌మోష‌న్స్ కూడా భారీగానే ప్లాన్ చేశారు. అయితే నేడు రిలీజ్ కావాల్సిన సినిమా ఎందుక‌నో ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింద‌నే దానిపై స‌రైన కార‌ణాలు తెలియ‌డం లేదు. నిర్మాత‌ల మండ‌లి వ్యవ‌హార‌మే కార‌ణ‌మై ఉండొచ్చున‌నే వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి త‌దుప‌రి రిలీజ్ డేట్‌ పై నిర్మాత‌లు ఏ నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.