'చినబాబు'ని అప్రిషియేట్ చేసిన ఉప రాష్ట్రపతి
Send us your feedback to audioarticles@vaarta.com
పెద్ద కుటుంబం, బంధాలు, బంధువులు వారి మధ్య అనురాగాలు .. ఇలా కాన్సెప్ట్‌తో రూపొందిన కుటుంబ కథా చిత్రం 'చినబాబు'. కార్తి, సయేషా నటించిన ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకుడు. ఈ సినిమాను రీసెంట్‌గా చూసిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందిస్తూ ట్వీట్ చేశారు.
"ఇటీవల కాలంలో నేను చూసిన మంచి సినిమా 'చినబాబు'. అశ్లీలత, జుగుప్సా మచ్చుకైనా లేకుండా రూపొందిన చిత్రం. గ్రామీణ వాతావరణం, పద్ధతులు, సంప్రదాయాలు, పచ్చని పొలాలతో ఆహ్లాద భరితంగా రూపొందిన 'చినబాబు' సకుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం.
వ్యవసాయ ప్రాధాన్యత, కుటుంబ జీవనము, పశుసంపద పట్ల ప్రేమ, ఆడపిల్లల పట్ల నెలకొన్న వివక్ష నేపథ్యంలో 'చినబాబు' చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ప్రజాదరణ పొందే విధంగా రూపొందించిన దర్శకుడు పాండిరాజ్, నిర్మాత సూర్య, నటుడు కార్తికి అభినందనలు" అన్నారు వెంకయ్య నాయుడు.
వెంకయ్యనాయుడు వంటి పెద్ద వ్యక్తి తమ సినిమాను అభినందించడం ఎంతో హ్యాపీగా ఉందని కార్తి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com