'చిన‌బాబు'ని అప్రిషియేట్ చేసిన ఉప రాష్ట్ర‌ప‌తి

  • IndiaGlitz, [Tuesday,July 17 2018]

పెద్ద కుటుంబం, బంధాలు, బంధువులు వారి మ‌ధ్య అనురాగాలు .. ఇలా కాన్సెప్ట్‌తో రూపొందిన కుటుంబ కథా చిత్రం 'చిన‌బాబు'. కార్తి, స‌యేషా న‌టించిన ఈ చిత్రానికి పాండిరాజ్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమాను రీసెంట్‌గా చూసిన ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు అభినందిస్తూ ట్వీట్ చేశారు.

ఇటీవల కాలంలో నేను చూసిన మంచి సినిమా 'చినబాబు'. అశ్లీలత, జుగుప్సా మచ్చుకైనా లేకుండా రూపొందిన చిత్రం. గ్రామీణ వాతావరణం, పద్ధతులు, సంప్రదాయాలు, పచ్చని పొలాలతో ఆహ్లాద భరితంగా రూపొందిన 'చినబాబు' సకుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం.

వ్యవసాయ ప్రాధాన్యత, కుటుంబ జీవనము, పశుసంపద పట్ల ప్రేమ, ఆడపిల్లల పట్ల నెలకొన్న వివక్ష నేపథ్యంలో 'చినబాబు' చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ప్రజాదరణ పొందే విధంగా రూపొందించిన దర్శకుడు పాండిరాజ్, నిర్మాత సూర్య, నటుడు కార్తికి అభినందనలు అన్నారు వెంక‌య్య నాయుడు.

వెంక‌య్యనాయుడు వంటి పెద్ద వ్య‌క్తి త‌మ సినిమాను అభినందించ‌డం ఎంతో హ్యాపీగా ఉంద‌ని కార్తి త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.

More News

సరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న డ్రైవర్ రాముడు

కమెడియన్ గానే కాకుండా హీరో గా కూడా దూసుకుపోతున్న మన  నవ్వుల వీరుడు షకలక శంకర్. తాను హీరో గా నటించిన శంభో శంకర చిత్రం ఘనవిజయం సాధించింది.

'నన్నుదోచుకుందువ‌టే' సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల‌

సమ్మోహనం తో తెలుగు ప్రేక్ష‌కుల్ని స‌మ్మోహ‌నం చేసుకున్న సుధీర్ బాబు హీరోగా,  సుధీర్ బాబు ప్రొడక్షన్స్  బ్యాన‌ర్ లో టాలెంట్‌డ్ ఆర్‌.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువటే..

సెకండ్ షెడ్యూల్ లో నిఖిల్ 'ముద్ర'

నిఖిల్ నటిస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ 'ముద్ర' టి.ఎన్. సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మొదటిసారి నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది.

'శైల‌జారెడ్డి అల్లుడు' క‌థ అదేనా?

అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా రూపొందుతోన్న చిత్రం 'శైల‌జారెడ్డి అల్లుడు'. 'మ‌హానుభావుడు' వంటి ఘ‌న‌విజ‌యం త‌రువాత మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ అత్త

లండ‌న్ షెడ్యూల్ పూర్తి చేసిన సూర్య‌...

వీడొక్క‌డే, బ్ర‌ద‌ర్స్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌రువాత త‌మిళ స్టార్ హీరో సూర్య, ద‌ర్శ‌కుడు కె.వి.ఆనంద్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే.