Varun Tej:బాబాయ్ పవన్ గెలుపు కోసం రంగంలోకి అబ్బాయ్ వరుణ్
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా జరుగుతోంది. ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఎందుకంటే పవన్‌ను ఓడించాలని అధికార వైసీపీ గట్టిగానే ప్లాన్ చేస్తుంది. ఆర్థిక, అంగ బలంతో పవన్‌కు చెక్ పెట్టాలని చూస్తోంది. అందుకే జనసేనాని కూడా ఈసారి వారి కుట్రలను ఛేదించి గెలవాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. స్థానిక టీడీపీ, బీజేపీ నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు.
మరోవైపు సినిమా ఇండస్ట్రీకి చెందిన హైపర్ ఆది, గెటప్ శీను, ఆర్కే నాయుడు, జానీ మాస్టర్ వంటి వాళ్లు కూడా పవన్ తరపున జోరుగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా బాబాయ్ గెలుపు కోసం అబ్బాయ్ వరుణ్ తేజ్ కూడా రంగంలోకి దిగనున్నారు. పిఠాపురంలో శనివారం వరుణ్ ప్రచారం చేయబోతున్నట్లు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్ నుంచి రాజమండ్రి చేరుకుంటారని.. అనంతరం గొల్లప్రోలు రూరల్ మండలం తాటిపర్తిలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రచారం ప్రారంభిస్తారని వెల్లడించింది.
అనంతరం వన్నెపూడి మీదుగా కొడవలి, చందుర్తి మీదుగా దుర్గాడ చేరుకుంటారు. ప్రచారంలో భాగంగా రోడ్ షో, సమావేశాల్లో వరుణ్ తేజ్ ప్రసంగిస్తారని తెలిపింది. మరి వరుణ్ ఏం ప్రసంగిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వ వైఫల్యాలపై గళమెత్తుతారా.. లేదంటే పవన్‌ను గెలిపించాలని మాత్రమే ప్రజలను కోరుతారా అనేది చూడాలి. మరోవైపు పోలింగ్ తేదీ లోపు మరి కొంతమంది మెగా హీరోలు కూడా ప్రచారం చేస్తారని జనసేన కార్యకర్తలు భావిస్తున్నారు.
అలాగే మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ సైతం ప్రచారం చేయనున్నారని రాజకీయ, సినీ వర్గాల్లోనూ వినబడుతోంది. అయితే ఆ ప్రచారంలో నిజం లేదని మెగా ఫ్యామిలీ వర్గాలు తెలిపాయి. రాజకీయ ప్రచారంలో వారు పాల్గొనడం లేదని స్పష్టంచేశాయి. కానీ పరోక్షంగా తమ మద్దతు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి జనసేన పార్టీకి ఐదు కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వడమే కాదు... అబ్బాయ్ రామ్‌చరణ్ చేత కూడా పార్టీకి ఫండ్ ఇప్పించారు. అంతేకాకుండా కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేశ్ బాబు గెలవాలని ఇటీవల ఓ వీడియో కూడా విడుదల చేశారు. దీంతో తన మద్దతు తమ్ముడికే అంటూ చెప్పకనే చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout