బాక్సర్ పాత్రలో వరుణ్‌తేజ్...
Send us your feedback to audioarticles@vaarta.com
ముకుంద, కంచె, మిస్టర్, ఫిదా, తొలిప్రేమ ఇలా జయాపజయాలకు అతీతంగా విభిన్నమైన పాత్రలు, వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపే హీరోల్లో వరుణ్ తేజ్ ఒకరు. ఈ మెగా క్యాంప్ హీరో ప్రస్తుతం టాలీవుడ్‌లో తొలి స్పేష్ చిత్రం 'అంతరిక్షం'లో నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా ఈ సినిమా తర్వాత వరుణ్ మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్‌లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారట. తాజా సమాచారం ప్రకారం వరుణ్‌తేజ్ బాక్సర్ పాత్రలో నటించబోతున్నాడట. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలున్నాయట. ఓ కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తాడని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments