27 ఏళ్ల తరువాత.. వెంకటేష్
Send us your feedback to audioarticles@vaarta.com
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, షాడో' చిత్రాల తరువాత వెంకటేష్ కథానాయకుడిగా ఈ ఏడాదిలో వస్తున్న సినిమా 'మసాలా'. హిందీలో ఘన విజయం సాధించిన 'బోల్ బచ్చన్' ఆధారంగా ఈ సినిమా రీమేక్ అయింది. కె.విజయభాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రామ్, అంజలి, షాజన్ పదంసీ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. తమన్ సంగీత మందించిన ఈ సినిమాని ఈ నెల 14న విడుదల చేయనున్నారు.
ఈ సినిమా విడుదలకి సంబంధించి ఓ విశేషమేమిటంటే.. 27 ఏళ్ల తరువాత వెంకటేష్ హీరోగా రూపొందిన సినిమా నవంబర్ నెలలో విడుదల కాబోతోంది. 1986లో వెంకటేష్ హీరోగా రూపొందిన రెండో చిత్రం 'బ్రహ్మరుద్రులు' నవంబర్ లో విడుదలైంది. మరల ఆ నెలలో వెంకటేష్ హీరోగా ఇప్పటి వరకు మరో సినిమా (అతిథి పాత్ర పోషించిన 'కృష్ణం వందే జగద్గురుం' రిలీజైంది నవంబర్ లోనే. ఇది మినహాయించుకుంటే..) రాలేదు.
విశేషమేమిటంటే.. 'బ్రహ్మరుద్రులు' ఏ తేదిన విడుదలైందో.. సరిగ్గా అదే తేదిన 'మసాలా' కూడా విడుదల కానుండడం. 'బ్రహ్మరుద్రులు' యావరేజ్ సినిమాగా పేరుతెచ్చుకుంది. మరి 'మసాలా' ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
Follow us on Google News and stay updated with the latest!
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com