'శూన్యం'గా రాబోతున్న చైతన్య
Send us your feedback to audioarticles@vaarta.com
దేవా కట్టా దర్శకత్వంలో 'ఆటోనగర్ సూర్య' చివరి షెడ్యూల్ ఒక వైపు, ఫ్యామిలీ మల్టీస్టారర్ 'మనం'మరోవైపు రెండు షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు నవ యువ సామ్రాట్ నాగచైతన్య. ఈ రెండు సినిమాల తర్వాత పరుశురాం దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడని వార్తలున్నప్పటికీ అధికారకంగా సమాచారం లేదు.
ఇప్పుడు చైతన్య, పరుశురాం కొత్త సినిమాకి సంబంధించి మరికొన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమా టైటిల్ శూన్యం అని, ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాత ఈ సినిమా ఉంటుందని, ఢమరుకం, ఆటోనగర్ సూర్య సినిమాలను నిర్మించిన ఆర్..ఆర్ వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడట.. ఆర్.ఆర్.మూవీస్ ఆర్థికంగా ఇబ్బందులేదుర్కొన్న నేపథ్యంలో వెంకట్ ఓ కొత్త బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించనున్నాడని సమాచారం.
Follow us on Google News and stay updated with the latest!
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com