13న 'మనసా తుళ్లి పడకే'
Send us your feedback to audioarticles@vaarta.com
View Manasa Thullipadake Press Meet Gallery |
అనురాగ్, కాజల్ యాదవ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న సినిమా మనసాతుళ్లిపడకే. కొరియోగ్రాఫర్ ఎమ్.సుజాత(సుజి) దర్శకత్వంలో రూపొందిన చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 13న విడుదలకు సిద్దమవుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో..
దర్శకనిర్మాత ఎమ్.సుజాత మాట్లాడుతూ తెలుగు తెరపై ఎన్నో ప్రేమకథలు వచ్చాయి. అయితే ఈ సినిమా కొత్త అనుభూతినిస్తుంది. డిఫెరెంట్ మూవీ. స్వచ్చమైన ప్రేమను తెలియజేసే చిత్రం. నా తొలి చిత్రమే ఇటువంటి మంచి ప్రేమకథను తీసినందుకు ఆనందంగా ఉంది.
ఈ సినిమాకి కథ ఒక హీరో అయితే అనురాగ్ మరో హీరో. చక్కని నటనను కనబరిచాడు. అలాగే కాజల్ యాదవ్ కూడా చక్కగా నటించింది. సంగీతం బాగా కుదిరింది. బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్ అవుతుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ నెల 13న అత్యధిక థియేటర్స్ లో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.
హీరో అనురాగ్ మాట్లాడుతూ మంచి సినిమాలో నేను భాగమైనందుకు ఆనందంగా ఉంది అని తెలిపారు.
సంగీత దర్శకుడు నరేష్ మాట్లాడుతూ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన చిత్రమిది. సినిమాని సుజి చక్కగా తెరకెక్కించారు. సినిమా అవుట్ పుట్ బాగా వచ్చింది. సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరింది. ఈ అవకాశం ఇచ్చిన సుజి గారికి థాంక్స్ అన్నారు.
Follow us on Google News and stay updated with the latest!
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com