'బూమ్ బూమ్' షూటింగ్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
చలపతి సిని పిలింస్ పతాకంపై భరత్ భూషణ్, మిలన్, రీతూ, చాఛాకటుదీప్ (బ్యాంకాక్ ఫేం) హీరోహీరోయిన్లుగా నగేష్ నారదాశి దర్శకత్వంలో టి.చలపతి నిర్మిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'బూమ్ బూమ్'. ఈ చిత్రం తొలి షెడ్యూల్ థాయ్ లాండ్ దేశంలోని పలు లొకేషన్స్ లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా...
చిత్ర దర్శకులు నగేష్ నారదాశి మాట్లాడుతూ - 'కధానుసారంగా దాదాపు 80శాతం విదేశాలలోనే ఈ చిత్రం షూటింగ్ చేయాల్సి ఉంది. అందుకే థాయ్ లాండ్ లోని అందమైన లొకేషన్స్ లో తొలి షెడ్యూల్ ని జరిపాము. సినిమా ఒపెనింగ్ రోజున విడుదల చేసిన టైటిల్ సాంగ్ ఈ సినిమాకు హైటెల్ గా నిలుస్తుంది. హీరో హీరోయిన్లతో పాటు బాలకృష్ణ, సతీష్, నరేందర్, హరి మరియు థాయ్ లండ్ లోని 15మంది ఆర్టిస్టులతో వినూత్న సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది' అని తెలిపారు.
చిత్ర నిర్మాత టి.చలపతి మాట్లాడుతూ - 'అనుకున్నది అనుకున్నట్లుగా ఈ చిత్రాన్ని కధానుసారంగా తెరకెక్కించడం జరిగింది. రెండో షెడ్యూల్ ను ఈ నెలాఖరుకు పూర్తి చేసి, వచ్చే నెలలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ చిత్రం పూర్తి ఎంటర్ టైన్మెంట్ తో యూత్ ని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది' అని చెప్పారు.
ఈ చిత్రానికి సంగీతం - సుభాష్ ఆనంద్, కొరియోగ్రఫి - హరి, నిర్మాత - టి.చలపతి, కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వం - నగేష్ నారదాసి.
Follow us on Google News and stay updated with the latest!
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com