'లెజెండ్' మార్చిలో విడుదల కానుందా
Send us your feedback to audioarticles@vaarta.com
వారాహి చలన చిత్రం, 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా లెజెండ్. యువరత్న బాలకృష్ణ, దర్శకుడు బోయపాటిల కాంభినేషన్ లో సింహా వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత రూపొందుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన సోనాల్చౌహాన్, రాధికాఅప్టే నటిస్తున్నారు. జగపతి బాబు ఇందులో విలన్ రోల్ చేస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీత సారధ్యంలో తొలిసారిగా బాలకృష్ణ నటిస్తున్నారు.
ఈ సంవత్సరం ఎన్నికలు బేస్గా చేసుకుని సినిమాని విడుదల చేయాలని షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. పొలిటికల్ బ్యాక్డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియో విడుదలను ఫ్రిభ్రవరిలో ప్లాన్ చేస్తున్నారు. సినిమాని కూడా మార్చి 28న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.
Follow us on Google News and stay updated with the latest!
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com