'నాకైతే నచ్చింది' ఆడియో విడుదల...
Send us your feedback to audioarticles@vaarta.com
రాధాకృష్ణ ఫిలిమ్ సర్క్యూట్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమా 'నాకైతే నచ్చింది'. శ్రీబాలాజీ, సోని, చరిష్టా, రిషిక నటీనటులు. ఎ.పి.రాధాకృష్ణ నిర్మాత. త్రినాథ్ కోసూరు దర్శకుడు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్ర గీతాల విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్ లో జరిగింది.
ఈ కార్యక్రమానికి, రెబల్ స్టార్ కృష్ణంరాజు, సిఐడి రత్నం తదితరులు హాజరయ్యారు. కృష్ణంరాజు ఆడియోసీడీలను ఆవిష్కరించగా తొలి సీడీని నిర్మాత రాధాకృష్ణ స్వీకరించారు. సిఐడి రత్నం థియేట్రికల్ ట్రైలర్స్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ...
దర్శకుడు త్రినాథ్ మాట్లాడుతూ 'ఇది ఒక యూత్ ఫుల్ లవ్ స్టోరీ. మణిశర్మగారు మంచి సంగీతాన్నిచ్చారు. సినిమా అనుకున్నట్టుగానే వచ్చింది. ఈ అవకాశం కల్పించిన నిర్మాతకి నాధన్యవాదాలు" అని అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ 'ఈ సినిమాని అందరి సహకారంతో 40 రోజుల్లో పూర్తిచేశాం. హైదరాబాద్, వైజాగ్, యానాం, ముమ్మిడి వరం తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెలలోనే సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. సినిమా సంగీతం బాగా కుదిరింది. సినిమాని దర్శకుడు చక్కగా తెరకెక్కించారు. సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది' అని అన్నారు.
కృష్ణంరాజు మాట్లాడుతూ 'సినిమా టైటిల్ బావుంది. దర్శకుడు చక్కగానే తెరకెక్కించాడని అనుకుంటున్నాను. మణిశర్మ సంగీతం అంటే మనం ఆలోచించాల్సిన పనిలేదు.
Follow us on Google News and stay updated with the latest!
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com