'దూకుడు' రీమేక్ లో త్రిష
Send us your feedback to audioarticles@vaarta.com
రెండేళ్ల క్రితం విడుదలై తెలుగులో సంచలన విజయం సాధించిన సినిమా 'దూకుడు'. మహేష్ బాబు హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ తెలుగు చిత్రాన్ని.. అతి త్వరలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా కన్నడంలోకి రీమేక్ చేయనున్నారు. కొన్ని నెలల క్రితం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ 'దూకుడు' కన్నడ రీమేక్ అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకోనుంది. తెలుగులో సమంత పోషించిన పాత్రని.. కన్నడంలో త్రిష పోషించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటివరకు తెలుగు, తమిళ భాషల్లోనే నటించి రెండుచోట్ల అగ్ర కథానాయికగా రాణించిన త్రిష.... తొట్ట తొలిసారిగా ఓ కన్నడ సినిమా నటించేందుకు అంగీకరించడాన్ని కోలీవుడ్ వర్గాలు విశేషంగా చెప్పుకుంటున్నాయి. ఈ సినిమా కోసం త్రిష భారీ పారితోషికాన్ని అందుకోబోతుందని ఆ వార్తల సారాంశాన్ని బట్టి తెలుస్తోంది. ఇంతకీ 'దూకుడు' రీమేక్ కి ఆమె కన్ ఫర్మ్ అయిందో లేదో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
Follow us on Google News and stay updated with the latest!
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com