'ఏమో గుర్రం ఎగరావచ్చు' డబ్బింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
ఆ నలుగురు ఫిలింస్ ప్రై.లిమిటెడ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా 'ఏమోగుర్రం ఎగరావచ్చు'. సుమంత్,పింకీ సావిక హీరోహీరోయిన్లు. మదన్ నిర్మాత. చంద్ర సిద్ధార్థ దర్శకుడు. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్‌ను కూడా పూర్తిచేసుకుంది. ఇప్పుడు మిగతా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొనే పనిలో ఉంది.
జీవితంలో ప్రతి విషయం పద్ధతిగా జరగాలనుకునే అమ్మాయికి, ప్రణాళికలు అవసరం లేదనుకునే అబ్బాయికి మధ్య జరిగే కథే ఈ సినిమా. ఈ కథను ప్రముఖ దర్శకుడు రాజమౌళి సోదరుడు కాంచి అందించగా, మరో సోదరుడు కీరవాణిగారు ఈసినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఆడియో, సినిమా విడుదల కూడా తొందరలోనే ఉండవచ్చునని సమాచారం. 2011 లో 'దగ్గరగా దూరంగా' సినిమాలో కనపడిన సుమంత్ చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించనున్నాడు మరి.
Follow us on Google News and stay updated with the latest!
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com