'లెజండ్'లో బాలకృష్ణ గెటప్ ఏంటంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
'సింహా' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత బాలకృష్ణ - బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. లెజెండ్ అనే పేరు పరిశీలనలో ఉన్న ఈ సినిమాలో రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. 'సింహా' సినిమాలో బాలకృష్ణని ఆహార్యం పరంగానూ.. అభినయం పరంగానూ కొత్తగా చూపించిన బోయపాటి ఈ సినిమాతోనూ నందమూరి అభిమానులను మరోమారు అలరించేందుకు కసరత్తులు చేస్తున్నారన్నది ఫిల్మ్ నగర్ వర్గాల కథనం.
ఇంతకీ సదరు 'లెజెండ్'లో బాలకృష్ణ గెటప్ ఎలా ఉంటుందనే దాని పై వినిపిస్తున్న కబుర్లేంటంటే.. బాలయ్య చెవికి ఓ రింగు.. మెడ పై త్రిశూలంతో కూడిన ఓమ్ సంకేతం ఉండేలా ఓ టాటూ.. మెడలో ఓ గోల్డ్ చైన్.. ఇలా రాయల్ గా ఉంటుందని. గెటప్ కోసమే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న బోయపాటి.. సినిమాపై ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటాడో మరి!
Follow us on Google News and stay updated with the latest!
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com