11న వస్తున్నాడు
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'రామయ్యా వస్తావయ్యా'. హరీష్ శంకర్ దర్శకుడు. ఈ సినిమాని ఈ నెల 11న విడుదల చేయడానికి నిర్ణయించినట్టు దిల్ రాజు ప్రకటించారు. యాక్షన్ ఎపిసోడ్ లు ఎక్కువగా ఉండటం వల్ల తమ సినిమాకు ఎ సర్టిఫికెట్ వచ్చిందని దిల్ రాజు అన్నారు.
హరీష్ కథ చెప్పినప్పుడు ఎలాంటి ఎగ్జయిట్ మెంట్ కలిగిందో సినిమా చూసినప్పడు కూడా అలాంటి ఫీలింగ్ కలిగిందట దిల్ రాజుకు. ఈ సినిమా 11న విడుదల కానుంది. గబ్బర్ సింగ్ కూడా 11నే విడుదలయిందట. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు కూడా 11నే విడుదలయిందట. 11వ తేదీన విడుదల కాబోయే రామయ్య సినిమా ఈ ఏడాది తొలి మూడు బ్లాక్ బస్టర్ లలో ఒకటిగా నిలుస్తుందని దిల్ రాజు ఇదిలా ఉంటే. ఈ నెల 11కి.. నందమూరి వంశానికి మంచి లింకే ఉంది.
అదేమిటంటే. సరిగ్గా 50 ఏళ్ల క్రితం సీనియర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ డూపర్ హిట్ సినిమా 'నర్తనశాల' అదే తేదిన 1963లో విడుదలైంది. అత్యంత సుందరంగా తెరకెక్కిన ఆ సినిమా ఇప్పటికీ ఆబాలగోపాలాన్ని అలరిస్తూనే ఉంది. సరిగ్గా ఆ సినిమా అర్థ శతాబ్దోత్సవాలు జరుపుకునే శుభ సమయంలో 'రామయ్యా వస్తావయ్యా రావడం శుభసూచికమే.
Follow us on Google News and stay updated with the latest!
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com